Jublihills Gangrape Case: బెయిల్ ఇవ్వడం కుదరదు..గ్యాంగ్ రేప్ కేసులో జువైనల్ జస్టిస్ కోర్టు స్పష్టీకరణ..!
Jublihills Gangrape Case: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌ను జువైనల్ జస్టిస్ కోర్టు విచారించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు..నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది.
Jublihills Gangrape Case: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌ను జువైనల్ జస్టిస్ కోర్టు విచారించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు..నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. కేసు తీవ్రత దృష్ట్యా నిందితులకు బెయిల్ ఇవ్వొద్దన్న పోలీసుల వాదనను ఏకీభవించింది. ఈక్రమంలోనే నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.
ఈకేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఉన్నారు. వీరిలో ఒకరు మేజర్ కాగా..మిగిలిన ఐదుగురు మైనర్లు ఉన్నారు. వీరిలో నలుగురు తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ జువైనల్ జస్టిస్ కోర్టులో పిటిషన్లు వేశారు. పిటిషన్లపై కోర్టు విచారించింది. ఈసందర్భంగా తమకు బెయిల్ ఇవ్వాలని నిందితులు ..కోర్టును కోరారు. ఐతే నలుగురు మైనర్లు సమాజంలో పలుకుబడి ఉన్న పిల్లలే ఉన్నారని కోర్టు దృష్టికి పోలీసులు తీసుకెళ్లారు.
కేసు దర్యాప్తు దశలో బెయిల్ ఇస్తే..బాధితులతోపాటు సాక్షులను కూడా నిందితులు ప్రభావితం చేస్తారని కోర్టుకు పోలీసులు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు..నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. మరోవైపు రేపు(గురు వారం) మరో మైనర్ బెయిల్ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వెలుగు చూసిన ఈఘటన తీవ్ర కలకలం రేపింది. పబ్‌కు వచ్చిన మైనర్ బాలిక పట్ల దురుసుగా ప్రవర్తించడంతోపాటు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనిపై అప్పట్లో తీవ్ర రాజకీయ దుమారం రేగింది.
Also read: Uddhav Thackeray: దేనికైనా రెడీ..రాజీనామాపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు..!
Also read:Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్..రైతు బంధు నిధుల జమ ఎప్పుడో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.