హైదరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్, ప్రైవేట్, భాగస్వామ్య ప్రాజెక్ట్ అయిన హైదరాబాద్ మెట్రో, ఇప్పటికే కారిడార్ 1లో భాగంగా మియాపూర్ నుండి ఎల్ బి నగర్ లైన్లో 29 కిమీలు, 27 స్టేషన్లు ఉన్నాయి. అత్యంత రద్దీగా సాగే జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి ఎంజీబీఎస్‌(కారిడార్‌-2) వరకు మెట్రోరైలు మార్గాన్ని నేడు జేబీఎస్‌ స్టేషన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. మెట్రో ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్‌ ఎంజీబీఎస్‌ వరకు ప్రయాణించారు. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 11 కి.మీ మార్గంలో 9 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. కేవలం 16 నిమిషాల్లోనే  ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. 



కాగా మెట్రోలో మొత్తం 69 కిలోమీటర్లు, 59 స్టేషన్లు, 3 ఇంటర్ చేంజ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌, మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, ప్రభుత్వ, మెట్రో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తొలి దశ మెట్రో ప్రాజెక్టులో ఇది చివరి దశ కావడంతో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. దేంతో హైదరాబాద్ నగర ప్రయాణికులకు మరీంత గమ్యాన్ని చేరుకునే అవకాశం లభించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..