Aghori naga sadhu: అఘోరీకి బిగ్ షాక్.. తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేసిన లాయర్..
Lawyer filed case on aghori: తెలంగాణలో ప్రస్తుతం అఘోరీ నాగసాధు పేరు మాత్రం మార్మోగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక లాయర్ ప్రస్తుతం తెలంగాణ డీజీపీ కలిసి అఘోరీ పై ఫిర్యాదు చేయడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
lawyer case filed against aghori nagasadhu: తెలంగాణలో అఘోరీ నాగ సాధుమాత ఘటన ప్రస్తుతం పోలీసులకు తలనొప్పిగా మారిందని చెప్పుకొవచ్చు. అఘోరీని ఇటీవల పోలీసులు మంచిర్యాలలోని కుశ్నపల్లిలోని తన ఇంటిలో నుంచి బైటకు రాకుండా నిర్బంధించిన విషయం తెలిసిందే. తాజాగా, అఘోరీ నాగ సాధు ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం ఘటనపై ఆమె దీపావళి రోజు.. తాను దహానం అయిపోతానని కూడా చెప్పుకొచ్చింది. అంతే కాకుండా.. ఇటీవల కొండగట్టు, వేముల వాడకు నాగ సాధు అఘోరీ సందర్శించింది. అక్కడున్న దర్గాను తీసివేయాలని కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. ఈ దరిద్రాన్ని ఇక్కడ నుంచి తీసేయాలని కూడా అన్నారు.
సనాతన ధర్మం కోసం తాను చావడానికైన సిద్దమే నంటూ కూడా అఘెరీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అనేక నాటకీయ పరిణామల మధ్య ఆమెను అదుపులోకి తీసుకుని మంచిర్యాలలోని కుశ్నపల్లికి తరలించారు. అక్కడ రెండు రోజుల పాటు ఉంచారు. ప్రస్తుతం కార్తీక మాసం నేపథ్యంలో..తన పూజకు విఘాతం కల్పిస్తే లేని దోషాలు చుట్టుకుంటాయని ఆమె చెప్పడంతో పోలీసులు ఆమెను కర్ణాటక, కేరళలో బార్డర్ వరకు తీసుకెళ్లి వదిలి వేసినట్లు తెలుస్తొంది.
అయితే.. ప్రస్తుతం ఈ అఘోరీపై హైదరబాద్ లో ఒక లాయర్ డీజీపీని కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తొంది. ఒక అఘోరీ ఇలా ప్రశాంతంగా ఉన్న హైదరబాద్ లో రెండు మతాల మధ్య ఘర్షణ వాతావరణం కలిగేలా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇంద్రియాలను అదుపులోకి పెట్టుకొలేని వారు.. అఘోరీ ఎలా అవుతారని అన్నారు. ఒక మతాన్ని, వర్గాన్ని కించపర్చే విధంగా అఘోరీ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తు కూడా డీజీపీని కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తొంది.
అఘోరీనాగసాధు ప్రస్తుతం కర్ణాటక, కేరళలోని ఆలయాలను సందర్శిస్తున్నట్లు తెలుస్తొంది. ఆ తర్వాత మరల ముత్యాలమ్మ ఆలయం దగ్గరకు వస్తానని ఆమె చెప్పినట్లు తెలుస్తొంది. కొంత మంది అఘోరీని వెనుక ఉండి నడిపిస్తున్నారని, ఆమె నిజమైన అఘోరీ కాదని కూడా సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వ్యాప్తి చెందున్నాయి. ప్రస్తుతం అఘోరీ మాత్రం తెలంగాణలో సెన్సెషన్ గా మారారని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook