Hyderabad  Meteorological Analysis On Telangana Weather:  రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు వాతావరణ పరిస్థితులను అంచనా వేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇదిలా ఉండగా తెలంగాణలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా మారుతున్నాయి. ఉదయం కాస్త చల్లగా మారిన వాతావరణం ఆ తర్వాత ఎండ మొదలైంది. నిన్న మొన్నటి వాతావరణ పరిస్థితులతో ఈరోజు చూస్తే ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ఇదీ చదవండి: కాంగ్రెస్‌లో కాక రేపుతున్న 'కడియం' రాక.. ఎంపీ ఎన్నికల్లో రేవంత్‌ రెడ్డికి కొత్త 'తలనొప్పి'
అయితే, రాగల మూడు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ద్రోణి గాలి విచ్చిన్నత ఒకటి కచ్ వద్ద ఉపరితలం ఆవర్తనం నుంచి మధ్య మహారాష్ట్ర, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. నిన్నటి వరకు మరఠ్వాడా పరిసర ప్రాంతాల వద్ద సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైంది. ఈరోజు ఆ ఆవర్తనం బలహీన పడి వాతావరణ పరిస్థితులు భిన్నంగా మారాయి.


 ఇదీ చదవండి:  ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం.. 25 మందితో రేవంత్ రెడ్డిపై నిఘా.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
రాగల 3 రోజులకు వాతావరణ సూచన.. 
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉదయం వాతావరణం చల్లబడింది. వర్షాలు పడే సూచన కూడా కనిపించాయి. అయితే, మధ్యాహ్నం పరిస్థితులు మారాయి. మళ్లీ ఎండ మొదలైంది. అయితే, ఈ రోజు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు రానున్న మూడు రోజులపాటు కూడా చోటుచేసుకోనున్న తెలంగాణ వాతావరణ స్థితిగతులను అంచనా వేసింది. తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.


ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందట. గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి  నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందట. ఇక రేపటి వాతావరణం విషయానికి వస్తే కొన్ని జిల్లాల్లో గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter