Telangana Phone Tapping SPY On CM Revanth Reddy With 25 People: తెలంగాణలో ఫోన్ టాపింగ్ వ్యవహరంలో మరికొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే అనేక మంది పోలీసు ఉన్నతాధికారులను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఈక్రమంలోనే సిట్ సంస్థ దీనిపై, దర్యాప్తు స్పీడ్ ను పెంచింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు.. 25 మంది స్పెషల్ టీంతో రేవంత్ రెడ్డి కదలికలపై 24 గంటలు నిఘా పెట్టారని పోలీసులు గుర్తించారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా నియమించినప్పటి నుండి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డట్టు సిట్ అధికారులు గుర్తించారు.
అదే విధంగా .. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు.. ఎవరెవరిని కలుస్తున్నారో తెలుసుకొని వివరాలు కేసీఆర్ కు ప్రణీత్ రావు టీమ్ అందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. ఈ నిఘాలో.. కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్సియల్ సోర్స్ ఎవరు అందిస్తున్నారోఅనే దానిపై నిరంతరం నిఘా పెట్టేవారు. అంతేకాకుండా.. నిరంతం వారి సమాచారం తెలుసుకొని కేసీఆర్ కు ఇస్తుండేవారని బైటపడింది. ఈక్రమంలో.. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని గులాబీ పార్టీ పెద్దలకు నివేదించారని సిట్ దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ మారడంతో ఈటేల రాజేందర్ పై 24 గంటలు నిఘా పెట్టారని సమాచారం.
ఈటెల ఎక్కడికి వెళ్తున్నారు.. ఎవర్ని కలుస్తున్నారు.. ఆయన టచ్ లో ఉన్నపార్టీనేతలపై కూడా నిరంతరం నిఘాను ఉంచినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఫోన్ వ్యవహరంను మాత్రం సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. రాజకీయ నాయకులు, అధికారుల ఫోన్ టాపింగ్ వ్యవహరంపై సీరియస్ గా దర్యాప్తు చేపట్టాలని, దీని వెనుక ఎలాంటి వారున్న అందర్ని బైటకు లాగి అరెస్టు చేసి జైలుకు తరలిస్తామన్నారు.
Read More: Snake Swallows Itself: బాప్ రే.. తన తోకను తానే మింగేస్తున్న పాము.. వైరల్ గా మారిన వీడియో..
అంతేకాకుండా.. ఇంకా ఎవరు ఈ ఫోన్ టాపింగ్ వ్యవహరంలో ఉన్నారు.., ఇంకా ఎంత మంది పొలిటిషియన్ల ఫోన్ లను టాపింగ్ చేశారో అనేదానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా మరోవైపు బీఆర్ఎస్ నేతల ఫోన్ టాపింగ్ వ్యవహరంపై తమకు ఎలాంటి సంబంధం కూడా లేదంటూ కొట్టిపారేస్తున్నారు. కావాలనే బీఆర్ఎస్ నేతలను అప్రతిష్టపాలు చేస్తున్నారంటూ ఎద్దేవాచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter