Hyderabad Metro Speed: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఇకపై మెట్రో రైలు స్పీడ్ మరింత పెరగనుంది. ఈ నిర్ణయంతో ప్రయాణికుల సమయం కూడా ఆదా కానుంది. హైదరాబాద్ మెట్రో రైళ్లు మరింత వేగంగా వెళ్లేందుకు కమిషనర్ ఆఫ్‌ మెట్రో రైల్వే సేఫ్టీ (CMRS)అనుమతించింది. ఇదే విషయాన్ని ఎల్‌అండ్‌టీ మెట్రో ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి స్పష్టం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే హైదరాబాద్ మెట్రో రైలు వేగాన్ని గత నెల మార్చి 28, 29 తేదీల్లో ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ క్రమంలో ఇప్పుడున్న వేగం కంటే మరో పది కిలోమీటర్లు వేగాన్ని మెట్రో రైలు పెంచేందుకు అనుమతి లభించింది. దీంతో దూరప్రాంతాలకు వెళ్లేవారికి సమయం కలిసిరానుంది. 


ఎంత సమయం ఆదా..?


పెరిగిన మెట్రో రైలు వేగం నేపథ్యంలో నాగోలు - రాయదుర్గం మధ్య 6 నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. మియాపూర్-ఎల్బీనగర్ మధ్య 4 నిమిషాలు.. జేబీఎస్ -ఎంజీబీఎస్‌ మధ్య 1.5 నిమిషాల ప్రయాణ సమయం ఆదా కానున్నట్లు తెలుస్తోంది. గతంలో 80 కిలోమీటర్ల వేగంతో మెట్రో రైలు వెళ్లేది. పెంచిన వేగంతో 90 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. 


ఈ నిర్ణయంపై హైదరాబాద్ నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీస్‌ పనులకు వెళ్లే వారంతా మెట్రోకే వెళ్తుంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో మెట్రో స్టేషన్లు కిక్కిరిసిపోతుంటాయి. మెట్రో రైల్వే సేఫ్టీ అధికారులు మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. 


Also Read: Revanth Reddy: తెలంగాణ రైతులకు కేసీఆర్ మరణశాసనం, ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి


Also Read: KCR Biopic: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ బయోపిక్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.