Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నీ మెడ మీద ఏకే 47 పెడితే ఫామ్ హౌజ్ రాసిస్తావా.. సీఎం కుర్చీ ఇస్తావా? అంటూ సూటిగా ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని దుయ్యబట్టారు. రైతులను మోసం చేసిన తెలంగాణ సర్కార్ ను రాళ్లతో కొట్టాలన్నారు. రైతులను వరి పంట సాగు చేయమని చెప్పి... ఇప్పుడు మాట మార్చి వరి ధాన్యం కొనమని చెప్పడం దారుణమన్నారు రేవంత్ రెడ్డి. పారా బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి టీఆర్ఎస్ ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిందన్నారు. దాని వల్లే ఇప్పుడు సమస్యలు వచ్చాయన్నారు.
తెలంగాణ రైతులకు కేసీఆర్ మరణ శాసనం రాశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రైతుల హక్కులను కేంద్రానికి తాకట్టు పెట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్.. నీ మెడ మీద ఏకే 47 పెడితే నీ ఫామ్ హౌజ్ రాసిస్తవా.. సీఎం కుర్చీ ఇస్తావా? అంటూ సూటిగా నిలదీశారు రేవంత్ రెడ్డి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో ప్రజల్లో ఉగాది పండగ ఉత్సాహం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలను ఏదో రకంగా దోచుకునే ప్రయత్నం చేయడం దారుణమని మండిపడ్డారు. యూపీఏ పాలనలో గ్యాస్ 414, డీజిల్ 55, పెట్రోల్ 71 రూపాయలు మాత్రమే ఉండేవన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పడి పోయినా.. ఇప్పుడు ధరలు భారీగా పెరిగాయన్నారు. కేంద్రం పన్నుల రూపంలో 10 లక్షల కోట్లు దోచుకుంటోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ మీద పన్నుతో 36 లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుంచి వసూలు చేశాయన్నారు. లీటర్ పెట్రోల్‌పై కేంద్రం 30, రాష్ట్రం 35 రూపాయలు టాక్స్ వసూలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. చత్తీస్‌ఘడ్‌లో రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించిందని రేవంత్ రెడ్డి చెప్పారు.
ధరల పెంపులో కేంద్రం, రాష్ట్రం ప్రభుత్వాలు రెండూ దోషులేనన్నారు రేవంత్ రెడ్డి. దోపిడీలో రెండూ ఒక్కటేనన్నారు. విద్యుత్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 17వేల కోట్లు బకాయి పడిందన్నారు. అందువల్లే విద్యుత్ సంస్థలు దివాలా తీసి కుప్ప కూలుతున్నాయని చెప్పారు.
Also read: Amaravathi: అమరావతి అభివృద్ధికి నాలుగేళ్లు పడుతుంది, కోర్టుకు స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook