Hyderabad Metro Charges: మెట్రో రైలు ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్.. పెరగనున్న ఛార్జీలు
Hyderabad Metro Ticket Charges Increase Soon: త్వరలో హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెరగనున్నాయి. ఛార్జీల పెంపునకు కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా కొత్త ధరలు అందుబాటులోకి రానున్నాయి.
Hyderabad Metro Ticket Charges Increase Soon: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అలర్ట్ ఇది. మెట్రో రైలు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న ఛార్జీలను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కోరింది. దీంతో ఛార్జీల పెంపు కోసం ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (ఎఫ్‌ఎఫ్‌సీ)ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. హైకోర్టు రిటైర్డ్ జడ్జీ న్యాయమూర్తి గుడిసేవ శ్యామ్ ప్రసాద్‌ను ఈ కమిటీకి ఛైర్మన్‌గా నియమించింది.
మెట్రో ఛార్జీల సవరణకు ప్రయాణికులు తమ అభిప్రాయాలను, సూచనలు, సలహాలను తెలపాలని నవంబర్ 15వ తేదీలోగా చెప్పాలని శ్యామ్ ప్రసాద్ కోరారు. మెయిల్ ffchmrl@gmail.com లేదా ఛైర్మన్, ఫేర్ ఫిక్సేషన్ కమిటీ, మెట్రో రైలు భవన్, బేగంపేట, 500003 చిరునామాకు పోస్ట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.
ప్రస్తుతం మెట్రో ట్రైన్ టిక్కెట్ ధర కనిష్ఠంగా రూ.10.. గరిష్ఠంగా 60 రూపాయల వరకు ఉంది. 2017 నవంబరు 28వ తేదీ నుంచి ఈ ఛార్జీలు అమలులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అమోదంతో ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ ఛార్జీలను అమలు చేస్తోంది. అయితే మెట్రో రైలు చట్టం ప్రకారం మెట్రో రైలు అడ్మినిస్ట్రేషన్ (MRA)కు మొదటిసారి మాత్రమే ఛార్జీలు పెంచేందుకు అవకాశం ఉంటుంది.
మరోసారి రేట్లు పెంచాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. కేంద్రం నియమించే ఫేర్ ఫిక్సేషన్ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకే మెట్రో ధరలు సవారించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రిక్వెస్ట్ మేరకు కేంద్ర ప్రభుత్వం గుడిసేవ శ్యామ్ ప్రసాద్‌గా కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు మెట్రో టికెట్ ధరలు పెరగనున్నాయి.
హైదరాబాద్ నగరంలో ఇటీవల ఆర్టీసీ ఛార్జీలు భారీగా పెరగడంతో మెట్రో రైళ్లకు డిమాండ్ పెరిగింది. నిత్య రద్దీతో ట్రైన్స్ నడుస్తున్నాయి. బస్సు ఛార్జీలతో పాటు మెట్రో ఛార్జీలు ఉండడంతో ఎక్కువశాతం మంది మెట్రో వైపే మొగ్గుచూపుతున్నారు. అందులోనూ ట్రాఫిక్ గోల నుంచి తప్పించుకోవచ్చని మెట్రోలో ప్రయాణించేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇటీవల డిమాండ్ పెరగడంతోనే మెట్రో టైమింగ్స్ కూడా ఛేంజ్ చేశారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రయాణికులకు మెట్రో సేవలు అందిస్తోంది.
Also Read: India T20 World Cup: టీమిండియా ఓటమికి అసలు కారణం చెప్పిన రోహిత్ శర్మ.. చేసిన తప్పులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook