Kavali Man Plan to Kill His Father and Mother: తన తల్లిని చంపితే రూ.5 లక్షలు ఇస్తా.. తండ్రిని చంపితే రూ.3 లక్షలు ఇస్తా.. ఓ దుర్మార్గపు కన్న కొడుకు ఓ గ్యాంగ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ఇది. ఆస్తి పంపకాలు సరిగా జరగలేదని కక్ష పెంచుకున్నాడు. తన కారులోనే కత్తులు పెట్టుకుని తిరుగుతూ.. హత్య చేసేందుకు ప్రయత్నించాడు. చివరికి పోలీసులు తెలివిగా వ్యహరించడంతో ఆ తల్లిదండ్రులు ప్రాణాలు నిలబడ్డాయి. నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా..
కావలికి చెందిన ఎమ్.లక్ష్మీనారాయణ అనే వ్యక్తి 15 ఏళ్ల కిందట తల్లిదండ్రులు, సోదరుడితో ఆస్తి పంపకాలు పూర్తి చేసుకున్నాడు. అయితే అప్పుడు తనకు దక్కకుండా పోయిన ఆస్తి కోట్ల రూపాయలు పలుకుతుండడంతో తనకు అన్యాయం జరిగిందని భావించాడు. దీంతో తల్లిదండ్రులను హత్య చేయాలని భావించాడు. ఆ తరువాత సోదరుడిని కూడా చంపేసి ఆస్తి ఛేజిక్కుంచుకోవాలని ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే షేక్ షఫీ అనే వ్యక్తికి విషయం చెప్పాడు. అతను అప్పటికే పలు కేసుల్లో నేరస్థులుగా జైలుకు వెళ్లి వచ్చిన షేక్ గౌస్ బాషా, షేక్ షాహుల్‌కు విషయం చెప్పాడు. ముగ్గురితో కలిసి లక్ష్మీనారాయణ మాట్లాడాడు. తల్లిని చంపితే రూ.5 లక్షలు, తండ్రిని చంపితే రూ.3 లక్షలు ఇస్తానని సుపారీ కుదుర్చుకున్నాడు.
ముగ్గురు కలిసి లక్ష్మీనారాయణ తల్లిదండ్రులను హత్య చేసేందుకు ప్లాన్ వేశారు. ఆటోలో రెక్కీ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఓ దొంగతంన కేసులో
నిందితులు పోలీసులకు చిక్కారు. వారిని తమదైన శైలిలో విచారించగా.. ఈ హత్యకు ప్రణాళిక చేసినట్లు చెప్పారు. హత్య కోసం కత్తులు కొన్నామని.. అవి లక్ష్మీనారాయణ కారులోనే ఉంచామని చెప్పారు.
కారులోని కత్తులు స్వాధీనం చేసుకుని.. నిందితులను అరెస్ట్ చేసినట్లు నెల్లూరు ఎస్పీ విజయరావు తెలిపారు. వారి వద్ద 94 గ్రాములు బంగారం, రూ.30 వేల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. దొంగతనం కేసులను ఛేదించడంతోపాటు.. రెండు ప్రాణాలను కాపాడిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.
Also Read: India T20 World Cup: టీమిండియా ఓటమికి అసలు కారణం చెప్పిన రోహిత్ శర్మ.. చేసిన తప్పులు ఇవే..
Also Read: Today Gold Rate: దేశంలో స్థిరంగా బంగారం, వెండి ధరలు.. విజయవాడలో తులం ఎంతంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook