మెట్రో ప్రయాణికులకు మొబైల్ యాప్
మెట్రో రైలు గురించి మొత్తం సమాచారం అందించేందుకు `టీసవారి` అనే పేరుతో ఒక యాప్ కూడా ప్రారంభించింది ప్రభుత్వం
హైదరాబాద్ మెట్రో రైలు ఇంకో మూడు రోజుల్లో ప్రారంభమవబోతోంది. ఈ క్రమంలో ప్రయాణికులకు ఈ మెట్రో రైలు గురించి మొత్తం సమాచారం అందించేందుకు "టీసవారి" అనే పేరుతో ఒక యాప్ కూడా ప్రారంభించింది ప్రభుత్వం. నవంబరు 28వ తేదీన మెట్రో రైలు ప్రారంభ వేడుకల్లో ఈ యాప్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. అలాగే ఈ రోజు నుండి హైదరాబాద్‌లో మైట్రో రైలు ప్రయాణికులకు స్మార్టుకార్డులు అమ్మేందుకు కౌంటర్లు ప్రారంభించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
తొలివిడతలో నాలుగు స్టేషన్లలో ఈ కార్డులను విక్రయిస్తున్నట్లు వారు తెలిపారు. మియాపూర్, ఎస్‌ఆర్ నగర్, తార్నాక, నాగోల్ స్టేషన్లలో ప్రయాణికులు ఈ కార్డులు పొందవచ్చు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరలకు స్టేషను కౌంటర్లలో ఈ కార్డులు అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. ఈ స్మార్టు కార్డు కొనడం ద్వారా టికెట్ ఛార్జీల్లో 5 శాతం డిస్కౌంటు కూడా లభిస్తుంది. అలాగే దాదాపు ఈ కార్డు 16 రకాల సేవలు భవష్యత్తులో అందించే విధంగా ఒక ప్లానింగ్ ఉందని మెట్రో రైలు అధికారులు తెలిపారు