Hyderabad Gang Rape Case: తెలంగాణలో ప్రకంపనలు రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లను పోలీస్ కస్టడీకి ఇచ్చింది జువెనైల్ కోర్టు. నిందితుల్లో ఏకైక మేజర్ గా ఉన్న ఏ1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ ను కస్టడీలోకి తీసుకుని రెండు రోజులుగా ప్రశ్నిస్తున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. జూవెనైల్ హోంలో ఉన్న మైనర్లను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. దీంతో గురువారం ముగ్గురి కస్టడీకి అనుమతి ఇచ్చిన కోర్టు.. శుక్రవారం మరో ఇద్దరిని ఐదు రోజుల పోలీస్  కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ ఇద్దరిలో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుతో పాటు బెంజీ కారు యజమాని కుమారుడు ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జువెనైల్ కోర్టు అనుమతితో ఎమ్మెల్యే కొడుకుతో పాటు మిగితా ఐదుగురు మైనర్లను ఇవాళ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ముగ్గురు మైనర్లను శుక్రవారమే పోలీసులు కస్టడీలోకి తీసుకోవాల్సి ఉంది. అయితే కోర్టు ఆదేశాలతో జువెనైల్ హోంలోనే విచారించాలని పోలీసులు ప్రయత్నించారు. అయితే జువెనైల్ హోంలో విచారించేందుకు నిరాకరించింది హోం. అందుకు తగిన ఏర్పాట్లు చేయలేమని, కోర్టు ఆదేశాలు తమకు లేవని తెలిపింది. ఇదే విషయాన్ని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లగా.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు అనుమతి ఇచ్చింది. దీంతో గ్యాంగ్ రేప్ కేసులో నిందితులుగా ఉన్న మేజర్ సాదుద్దీన్ మాలిక్ తో పాటు ఐదుగురు మైనర్లను.. ఈ కేసులో ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్న బంజారాహిల్స్ ఏసిపి సుదర్శన్ ప్రశ్నించనున్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే  కొడుకు, బల్దియా కార్పొరేటర్ తనయుడు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు, సంగారెడ్డి టీఆర్ఎస్ నేత కొడుకు, మాజీ ఎమ్మెల్యే మనవడితో పాటు మరో మైనర్ ను పోలీసులు ప్రశ్నించనున్నారు.


ఇక రెండు రోజుల విచారణలో గ్యాంగ్ రేప్ కు సంబంధించి కీలక విషయాలను సాదుద్దీన్ మాలిక్ పోలీసులు చెప్పారని తెలుస్తోంది. ఏ1 నిందితుడు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని చెబుతున్నారు. సాదుద్దీన్ చెబుతున్న విషయాలను తమ దగ్గర ఉన్న సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజ్ తో సరి చూసుకుంటున్నారు పోలీసులు. ఏదైనా తేడా అనిపిస్తే మాలిక్ ను పలు కోణాల్లో ప్రశ్నించి క్లారిటీ వచ్చేలా చూసుకుంటున్నారు. ఈ కేసులోని ఐదుగురు నిందితులకు ప్రభుత్వ వైద్యులచే పొటెన్సీ టెస్ట్ నిర్వహించాలని జూబ్లీహిల్స్ పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో చార్జీషీట్ దాఖలుకు ఈ టెస్ట్ కంపల్సరీ అని తెలుస్తోంది. మైనర్ల ఐడెంటిఫికేషన్ టెస్ట్ కు పోలీసులు సిద్ధమవుతున్నారు.  బాధితురాలికి నిందితులను చూపించి.. నేరం చేసింది వీళ్లేనా కాదా అని నిర్ధారించుకోనున్నారు పోలీసులు. ఐడెంటిఫికేషన్ టెస్ట్ కోసం కోర్టు అనుమతికి ప్రయత్నిస్తున్నారు. గ్యాంగ్ రేప్ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. నిందితులకు కఠిన శిక్ష పడేలా పక్కాగా ఆధారాలు సేకరిస్తున్నారని తెలుస్తోంది.ఇందులో భాగంగానే ఐడెంటిఫికేషన్ టెస్ట్  తో పాటు  పొటెన్సీ టెస్ట్ కు సిద్దమవుతున్నారు.


మరోవైపు గ్యాంగ్ రేప్ కు గురైన మైనర్ బాలిక మెడికల్ రిపోర్టులో సంచలన అంశాలు ఉన్నాయని తెలుస్తోంది. అత్యాచారం చేసే సమయంలో బాలికను నిందితులు దారుణంగా హింసించారని తెలుస్తోంది. బాధితురాలి మెడ చుట్టూ పళ్లతో కొరిగిన గాయాలు కనిపిస్తున్నాయి. దాదాపు ఏడు ఎనిమిది చోట్ల పంటి గాయాలు స్పష్టంగా ఉన్నాయని వైద్యులు పోలీసులకు నివేదిక ఇచ్చారు. బాలిక గోళ్లతో రక్కిన గుర్తులు కూడా ఉన్నాయి. రేప్ చేసే సమయంలో బాలిక ప్రతిఘటించడంతో నిందితులు దారుణంగా హింసించారని పోలీసులు భావిస్తున్నారు. గ్యాంగ్ రేప్ జరిగిన ఇన్నోవా వాహనంలో పోలీసులు సేకరింతిన ఆధారాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్ కు పంపారు. దానికి సంబంధించిన నివేదికలు రావాల్సి ఉంది. ఫోరెన్సిక్ నివేదికలో మరిన్ని సంచలన అంశాలు వెలుగుచూసే అవకాశాలు ఉన్నాయి.


Read also: Gold Price Today: మళ్లీ తగ్గిన బంగారం ధర... ఈసారి ఎంత తగ్గిందంటే...


Read also: Rajya Sabha Election: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం.. 4 రాష్ట్రాల్లో 8 స్థానాల్లో గెలుపు...  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook