Rajya Sabha Election: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం.. 4 రాష్ట్రాల్లో 8 స్థానాల్లో గెలుపు...

Rajya Sabha Election 2022: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. నాలుగు రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు  శుక్రవారం (జూన్ 10) జరిగిన ఎన్నికల్లో 8 స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 11, 2022, 07:28 AM IST
  • ముగిసిన రాజ్యసభ ఎన్నికలు
  • 4 రాష్ట్రాల్లో 8 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ
  • 5 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ
Rajya Sabha Election: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం.. 4 రాష్ట్రాల్లో 8 స్థానాల్లో గెలుపు...

Rajya Sabha Election 2022: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. నాలుగు రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు  శుక్రవారం (జూన్ 10) జరిగిన ఎన్నికల్లో 8 స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. మహారాష్ట్రలో 3, కర్ణాటకలో 3, రాజస్తాన్‌, హర్యానాల్లో ఒక్కో స్థానాన్ని దక్కించుకుంది. హర్యానాలో రెండు రాజ్యసభ స్థానాలకు గాను మరో స్థానంలో బీజేపీ మద్దతు ఇచ్చిన జేజేపీ అభ్యర్థి కార్తీకేయ శర్మ గెలుపొందడం విశేషం. క్రాస్ ఓటింగ్ కారణంగా ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది.

శుక్రవారం సాయంత్రం 4గంటలకు పోలింగ్ ముగియగా.. అర్ధరాత్రి వరకు కౌంటింగ్ కొనసాగింది.  హర్యానా, మహారాష్ట్రల్లో బీజేపీ, కాంగ్రెస్ నేతల పరస్పర ఫిర్యాదులతో కౌంటింగ్ ప్రక్రియ ఎనిమిది గంటలకు పైనే సాగింది. మహారాష్ట్రలో క్రాస్ ఓటింగ్‌పై బీజేపీ, శివసేనలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. మహా వికాస్ అఘాడీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల ఓట్ల చెల్లుబాటుపై ఎన్నికల కమిషన్‌ను బీజేపీ ప్రశ్నించింది. ఆ ఓట్లను రద్దు చేయాలని కోరింది. బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యేతో పాటు ఓ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఓట్లను ఇన్వాలిడ్‌గా ప్రకటించాలని మహా వికాస్ అఘాడీ ఎన్నికల కమిషన్‌ను కోరింది.

హర్యానాలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తమ అభ్యర్థి అజయ్ మాకెన్ గెలిచారంటూ మొదట కాంగ్రెస్‌ తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించుకుంది. కానీ ఆ తర్వాత జరిగిన రీకౌంటింగ్‌లో బీజేపీ బలపరిచిన కార్తీకేయ శర్మ చేతిలో అజయ్ మాకెన్ ఓడిపోయాడు. హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 31 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ క్రాస్ ఓటింగ్ ఆ పార్టీ కొంపముంచినట్లు తెలుస్తోంది.

రాజస్తాన్‌లో కాంగ్రెస్ మూడు రాజ్యసభ స్థానాలు గెలుచుకోగా బీజేపీ ఒక స్థానంలో గెలుపొందింది. బీజేపీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ కారణంగా కాంగ్రెస్ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు పోల్ అయ్యాయి. రాజస్తాన్‌లో బీజేపీ బలపరిచిన మీడియా మొఘల్ సుభాష్ చంద్రకు ఓటమి తప్పలేదు. ఇక కర్ణాటకలో బీజేపీ 3, కాంగ్రెస్ 1 స్థానంలో గెలుపొందాయి. ఇక్కడ జేడీఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. కాగా, మొత్తం 15 రాష్ట్రాల్లోని 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇందులో 41 స్థానాలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే.

Also Read: Horoscope Today June 11th : నేటి రాశి ఫలాలు... ఆ రాశి వారికి ఇవాళ చాలా ప్రత్యేకమైన రోజు..

Also Read: PRESIDENT ELECTION 2022: వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కాకుండా జగన్ అడ్డుకుంటున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News