ఎంఆర్పిఎస్ ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులు
ఎంఆర్పిఎస్ ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులు
హైదరాబాద్: ఇందిరా పార్కు వద్ద ఆదివారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన సమావేశానికి అనుమతి లేదని హైదరాబాద్ పోలీసులు స్పష్టంచేశారు. ఇందిరా పార్కు రోడ్డును ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూసివేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇందిరా పార్కు మార్గంలో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా సూచించిన పోలీసులు.. ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ దారి మల్లింపు విషయంలో ప్రజలు తమకు సహకరించాలని పౌరులకు విజ్ఞప్తిచేశారు.