Hyderabad Honour Killing: నీరజ్ హత్యకు పక్కా స్కెచ్.. రిమాండ్ రిపోర్ట్ లో సంచలన అంశాలు
Hyderabad Honour Killing: హైదరాబాద్ లో సంచలనం రేపిన బేగంబజార్ పరువు హత్య కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. నీరజ్ పవార్ ను దారుణంగా హత్య చేసి పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పించుకు తిరుగుతున్న అభినందన్ యాదవ్, మహేష్ అహిర్ యాదవ్ ను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Hyderabad Honour Killing: హైదరాబాద్ లో సంచలనం రేపిన బేగంబజార్ పరువు హత్య కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. నీరజ్ పవార్ ను దారుణంగా హత్య చేసి పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పించుకు తిరుగుతున్న అభినందన్ యాదవ్, మహేష్ అహిర్ యాదవ్ ను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మే20 రాత్రి షాహినాథ్ గంజ్ పీఎస్ పరిధిలోని మచ్చీ మార్కెట్‌లో ఈ హత్య జరిగింది. రెండు బైక్‌లపై వచ్చిన దుండగులు.. అందరూ చూస్తుండగానే నీరజ్ పై దాడి చేశారు. బండ రాయి మోది తర్వాత కత్తులతో పొడిచి చంపారు. 20 కత్తిపోట్లకు గురైన నీరజ్.. స్పాట్ లోనే చనిపోయాడు. ప్రేమ పెళ్లి చేసుకున్నాడనే కక్షతోనే నీరజ్ ను.. అతని భార్య సోదరుడు హత్య చేశారని పోలీసుల విచారణలో తేలింది.
నీరజ్ పవార్ హత్యకు సంబంధించిన పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ఉన్నాయి. పరువు పోవడంతో పాటు అవమాన భారంతోనే నీరజ్ ను చంపేశామని విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. కుమారుడు పట్టాక అహీర్ సమాజ్ కు చెందిన వ్యక్తులతో నీరజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని తెలిపారు. దీంతో యాదవ్ సమాజ్ లో జరిగే కార్యక్రమాలకి సంజన కుటుంబ సభ్యులను బంధువులు పిలవలేదట. ఎక్కడికి వెళ్ళినా అవమాన భారంతో కుంగిపోయారట సంజన కుటుంబ సభ్యులు. ఆ ఆవమాన భారంతోనే నీరజ్ ను హత్య చేశామని పోలీసుల విచారణలో నిందితులు తెలిపారు.
చాలాకాలంగా నీరజ్, సంజన ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు సంజనను బయటికి వెళ్లకుండా కట్టడి చేశారు. అయినా చాటుగా నీరజ్ తో ప్రేమాయణం సాగించింది సంజన. దీంతో గత ఏడాది ఏప్రిల్ లో సంజనకు మరో అబ్బాయితో మ్యారేజ్ ఫిక్స్ చేశారు కుటుంబ సభ్యులు. దీంతో పెళ్లికి మూడు నెలల ముందు ఇంటి నుంచి పారిపోయింది సంజన. ఆర్య సమాజ్ లో నీరజ్ ను రిజిస్టర్ మ్యారేజీ చేసుకుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో సంజన కుటుంబ సభ్యులు ఆగ్రహం చెందారు. తమ కూతురు చనిపోయిందంటూ ఇంట్లో సంజన ఫోటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు తల్లిదండ్రులు. దాదాపు ఏడాది పాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్న సంజన.. బాబు పుట్టాక తల్లితో మాట్లాడింది. అప్పుడు కూడా బేగంబజార్ కు రావొద్దని సంజనను ఆమె తల్లి హెచ్చరించింది. అయినా తన తల్లి మాటను లెక్కచేయకుండా బేగంబజార్ లోనే నివసించింది సంజన. దీంతో మరింత కోపం పెంచుకున్న ఆమె కుటుంబ సభ్యులు.. నీరజ్ ను చంపేందుకు స్కెచ్ వేశారు.
గత గురువారం జుమేరాత్ బజార్ లో కత్తులు, రాడ్లు కొన్నారు నిందితులు. శుక్రవారం నీరజ్ కోసం ఒక బాలుడితో రెక్కి నిర్వహించారు. నీరజ్ అక్కడే ఉన్నారని తెలుసుకున్న నిందితులు చంపాలని డిసైడ్ అయ్యారు. తన తాతతో కలిసి బైక్ పై వెళుతున్న నీరజ్ ను అడ్డగించారు. కంట్లో కారం చల్లి.. బండరాళ్ల కొట్టారు. కిందపడిపోయిన నీరజ్ ను కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. తీవ్ర గాయాలైన నీరజ్.. అక్కడే రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడు. హత్యకు ముందు ఫుల్లుగా మద్యం సేవించారు నిందితులు. నీరజ్ ను చంపేసిన తర్వాత బైకులపై అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కేసులో 24 గంటలలోపే సంజన సోదరుడు సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరు నిందితులను తాజాగా అదుపులోనికి తీసుకున్నారు.
READ ALSO: Election Survey: ప్రధానిగా మోడీ కంటే రాహులే బెటర్! బీజేపీకి షాకిచ్చిన సర్వే..
READ ALSO: KCR DELHI TOUR: కేసీఆర్ చెప్పే సంచలనం ఇదేనా? బీజేపీకి గండమేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook