MLA RAJA SINGH ARREST: హైదరాబాద్ లో హై టెన్షన్ కొనసాగుతోంది. గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. రాజాసింగ్ ను అతని నివాసంలో అదుపులోనికి తీసుకున్నారు సౌత్ జోన్ పోలీసులు. తన యూట్యూబ్ ఛానెల్ లో నిన్న ఓ వీడియోను పోస్ట్ చేశారు రాజా సింగ్. అయితే అందులో మహ్మద్ ప్రవక్తను కించపరిచారంటూ అర్ధరాత్రి తర్వాత పాతబస్తీలో ఎంఐఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఓల్డ్ సిటీలోని అన్ని పోలీస్ స్టేషన్లలో రాజాసింగ్ పై ఫిర్యాదు చేశారు. విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడిన రాజాసింగ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ల దగ్గర భైఠాయించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఎంఐఎం కార్యకర్తల ఫిర్యాదుతో డబీర్ పురా పోలీస్ స్టేషన్ లో రాజా సింగ్ పై కేస్ నమోదైంది. ఈ కేసులోనే రాజాసింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించారు. ఎంఐఎం ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తడంతో హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తి మేరకు రాజాసింగ్ వివాదాస్పద వీడియోని యూట్యూబ్ తొలగించింది. తన వీడియోపై వస్తున్న వివాదంపై స్పందించారు రాజాసింగ్. తాను ఎవరిని కించపరచలేదని చెప్పారు. మునావర్ ఫారూఖీ షోకి అనుమతి ఇస్తే వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తానని ముందే చెప్పానని చెప్పారు. ధర్మం కోసం తాను చావడానికైనా సిద్దమన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. తాను చేసిన వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించారని అన్నారు. శ్రీరాముడిని కించపరిచిన వ్యక్తికి పోలీసులు ఎలా రక్షణ కల్పిస్తారని రాజాసింగ్ ప్రశ్నించారు.


బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టుతో హైదరాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి