Hyderabad Gang Rape Case: గ్యాంగ్ రేప్ కేసులో సంచలనం.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ పై కేసు
Hyderabad Gang Rape Case: జూబ్లీహిల్స్ పబ్ కు వచ్చిన మైనక్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోనికి వస్తోంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదైంది.
Hyderabad Gang Rape Case: జూబ్లీహిల్స్ పబ్ కు వచ్చిన మైనక్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోనికి వస్తోంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదైంది. అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. క్రైం నెంబర్ 161/2022 సెక్షన్ 228A కింద కేసు రఘునందన్ పై కేసు ఫైల్ చేశారు. రఘునందన్ పై సెంట్రల్ జోన్ డీసీపీకి కారం కొమ్మిరెడ్డి సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే రఘునందన్ ను నిందితుడి గా చేర్చారు పోలీసులు. సెక్షన్376 ప్రకారం నేరానికి పాల్పడ్డ కేసుల్లో వ్యక్తులను బహిర్గతం చేయటం నేరం. ఈ సెక్షన్ ప్రకారమే 228ఏ కింద బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై ఆబిడ్స్ పోలీసుకు కేసు బుక్ చేశారు. ఈ కేసులోనే మైనర్ బాలికకు సంబంధించిన వీడియోలు వైరల్ చేసిన పాతబస్తీకి చెందిన సుభాన్ అనే జర్నలిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు.మరో రెండు యూట్యూబ్ చానల్స్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.
గ్యాంగ్ రేప్ కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. అందుకు సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ మీడియో సమావేశంలో కొన్ని ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేశారు. వీడియోలో మైనర్ బాలికతో పాటు నలుగురు యువకులు కారులో ప్రయాణిస్తున్నారు. ఈ ఘటన తర్వాత బీజేపీ ఎమ్మెల్యేకి ఈ ఫోటోలు, వీడియోలు ఎలా వచ్చాయన్న ప్రశ్నలు వచ్చాయి. పోలీసులు కూడా దీనిపై ఆరా తీశారు. మైనర్ బాలిక వీడియోలు విడుదల చేసిన ఎమ్మెల్యే రఘునందన్ రావును కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేశారు. రఘునందన్ రావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అయితే రఘునందన్ రావు తనపై వస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
తాను మైనర్ బాలిక పేరు చెప్పలేదని.. ఆమె ముఖం కూడా చూపించలేదని రఘునందన్ రావు క్లారిటీ ఇచ్చారు. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకును తప్పించే కుట్ర జరుగుతోందని చెప్పానన్నారు. తాను ఫోటోలను విడుదల చేయక ముందే.. అవి మీడియా, సోషల్ మీడియాలో వచ్చాయని తెలిపారు. అసలు దోషులను తప్పించేందుకు ఇలా కుట్రలు చేస్తున్నారని రఘునందన్ ఆరోపించారు. తనకు కేసులు ఎదుర్కోవడం కొత్తేమి కాదన్న బీజేపీ ఎమ్మెల్యే.. వెస్ట్ జోన్ డీసీపీకి జోయల్ డెవిస్‌కు ఈ విషయం తెలుసన్నారు. కారులో ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకును ఎందుకు అరెస్ట్ చేయడం లేదని పోలీసులను ప్రశ్నించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు ఎమ్మెల్యే రఘునందన్‌రావు.
మరోవైపు గ్యాంగ్ రేప్ కు గురైన మైనర్ బాలిక వీడియోలు లీక్ కావడం వెనుక సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. బాధితురాలిని కారులో తీసుకెళ్తున్నప్పుడు నిందితులు తీసిన వీడియోలను.. బల్దియా ఎంఐఎం కార్పొరేటర్ లీక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో తన కొడుకు కూడా ఉండటంతో.. కారులో బాలిక తన ఇష్టపూర్వకంగానే వారితో అలా వ్యవహరించిందని చెప్పేందుకే ఈ వీడియోలు లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి