Secunderabad Gang Rape: సికింద్రాబాద్‌లో బాలికపై ఐదుగురి గ్యాంగ్ రేప్.. జూబ్లీహిల్స్ ఘటన మరవకముందే వెలుగులోకి మరో ఘోరం...

Another Gang Rape in Hyd: జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన మరవకముందే నగరంలో మరో గ్యాంగ్ రేప్ ఘటన వెలుగుచూసింది. సికింద్రాబాద్ పరిధిలోని కార్ఖానాలో ఓ బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 7, 2022, 07:13 AM IST
Secunderabad Gang Rape: సికింద్రాబాద్‌లో బాలికపై ఐదుగురి గ్యాంగ్ రేప్.. జూబ్లీహిల్స్ ఘటన మరవకముందే వెలుగులోకి మరో ఘోరం...

Another Gang Rape in Hyd: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన ఎంత దుమారం రేపుతోందో తెలిసిందే. ఈ వ్యవహారం తెరపై ఉండగానే మరో గ్యాంగ్ రేప్ ఘటన తెరపైకి వచ్చింది. సికింద్రాబాద్‌లోని కార్ఖానా పరిధిలో ఓ బాలిక సామూహిక అత్యాచారానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రెండు నెలల క్రితం బాలికపై గ్యాంగ్ రేప్ జరగ్గా బాలిక తల్లిదండ్రులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

బాధిత బాలికతో ఇద్దరు యువకులు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్నారు. మాయ మాటలతో బాలికను ఆకర్షించారు. ఈ క్రమంలో బాలిక వారిని కలవగా ఆమెను శారీరకంగా లోబరుచుకుని... గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఆ సమయంలో సెల్‌ఫోన్లలో వీడియోలు చిత్రీకరించారు. ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని బాలికను బ్లాక్‌మెయిల్ చేశారు. దీంతో బాలిక వారు చెప్పినట్లు చేసింది. వీడియోలు తొలగిస్తామని చెప్పి ఓరోజు ఆమెను పిలిపించిన యువకులు... మరికొందరు స్నేహితులతో కలిసి బాలికపై మరోసారి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. 
మొత్తం ఐదుగురు బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ కార్ఖానా పరిధిలో బాలికపై రేప్ జరిగినట్లు సమాచారం. 

గ్యాంగ్ రేప్ తర్వాత బాలిక ప్రవర్తనలో మార్పు వచ్చింది. మానసికంగా కుంగిపోయింది. కూతురు ఎప్పుడూ ముభావంగా ఉండటం గమనించి.. తల్లిదండ్రులు ఆమెను సైక్రియాటిస్ట్ వద్దకు తీసుకెళ్లారు. తనపై జరిగిన గ్యాంగ్ రేప్‌ను బాలిక సైక్రియాటిస్ట్‌తో చెప్పింది. సైక్రియాటిస్ట్ ఆమె కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వారు షాక్ తిన్నారు. మే 30న వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దాదాపు రెండు నెలల క్రితం బాలికపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుల్లో ఇద్దరిని రితేశ్, ధీరజ్‌లుగా గుర్తించినట్లు సమాచారం. నిందితుల్లో ఒక మైనర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: Horoscope Today June 7th : నేటి రాశి ఫలాలు... వ్యాపార రంగంలో ఉన్న ఆ రాశుల వారికి మంచి లాభాలు...

Also Read: Raghunandan Rao: గ్యాంగ్‌ రేప్‌ కేసులో నిందితులను తప్పించే కుట్ర..తానేవరికీ భయపడను: రఘునందన్‌రావు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News