Priest Murdered Woman: హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో దారుణం జరిగింది. నగల కోసం ఓ పూజారి మహిళను దారుణంగా హత్య చేశాడు. ఆలయానికి వచ్చిన మహిళను ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు. అక్షింతలు వేస్తానని చెప్పి... ఆమె తల వంచగానే ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. హత్యానంతరం ఆమె మృతదేహాన్ని ఆలయ పరిసరాల్లోని ఓ డ్రమ్ములో పడేశాడు. ఆపై ఎప్పటిలాగే అర్చకుడిలా ఆలయంలో పూజలు చేస్తూ కనిపించాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ హత్యోదంతం బయటపడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే... మల్కాజ్‌గిరి పరిధిలోని విష్ణుపురి కాలనీలో స్వయం భూసిద్ధి వినాయక స్వామి ఆలయంలో మురళీకృష్ణ అనే వ్యక్తి గత నాలుగేళ్లుగా పూజారిగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో నివాసముండే ఉమాదేవి (57) అనే మహిళ నిత్యం ఆ ఆలయానికి వెళ్తుంటుంది. ఈ క్రమంలో ఆమె ఒంటిపై ఉన్న నగలపై మురళీకృష్ణ కన్ను పడింది.


ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మురళీకృష్ణ ఎలాగైనా ఉమాదేవి నగలను కాజేయాలనుకున్నాడు. ఇందుకోసం ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆలయ పరిసరాల్లో సీసీటీవీ ఫుటేజీలు పనిచేయట్లేదని గుర్తించాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే సోమవారం (ఏప్రిల్ 20) సాయంత్రం 6.30 గంటలు ఉమాదేవి ఆలయానికి వెళ్లారు. పూజల అనంతరం ఆలయం నుంచి బయటకు నడుస్తుండగా... అక్షింతలు వేస్తానని చెప్పి ఉమాదేవిని మురళీకృష్ణ ఆగమన్నాడు.


అంతే.. ఉమాదేవి వద్దకు వెళ్లి అక్షింతల కోసం ఆమె తల కాస్త వంచగానే ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. తల వెనుక భాగంలో బలంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావంతో ఉమాదేవి అక్కడికక్కడే కుప్పకూలింది. ఉమాదేవి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమె మృతదేహాన్ని ఆలయ పరిసరాల్లోని ఓ ప్లాస్టిక్ డ్రమ్ముో పడేశాడు. ఆమె ఒంటిపై నగలను కాజేశాడు. రక్తపు మరకలు కనబడకుండా అంతా కడిగేశాడు. 


అదే రోజు రాత్రి ఓ నగల వ్యాపారికి ఆ నగలను అమ్మేశాడు. మరుసటి రోజు ఏమీ తెలియనట్లు ఆలయానికి వెళ్లి పూజారిగా మళ్లీ తన పని తాను చేయడంలో నిమగ్నమయ్యాడు. అయితే డ్రమ్ములో నుంచి మృతదేహం దుర్వాసన రావడంతో... అందులో నుంచి తీసి ఆలయం వెనక ఉన్న చెట్లల్లో పడేశాడు.


మరోవైపు, ఉమాదేవి భర్త ఆమె కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా... ఆమె చివరిసారిగా ఆలయానికి వెళ్లిందని తెలిసి... అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఆలయంలో ఆమె చెప్పులు కనిపించడంతో.. ఆమె అక్కడి నుంచి తిరిగి వెళ్లలేదని నిర్ధారించుకున్నారు. పూజారిపై అనుమానంతో అతన్ని విచారించగా నేరం అంగీకరించాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు.


Also Read: Horoscope Today April 23 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారు 'రియల్ ఎస్టేట్‌'కు దూరంగా ఉంటే మంచిది..  


Also Read: Bhadrachalam Railway Line: భద్రాచలం రాముడి సన్నిధికి కొత్త రైల్వే లైను, ఎక్కడ్నించి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.