Hyderabad Rains: హైదరాబాద్లో వరుణ ప్రతాపం..లోతట్టు ప్రాంతాలు జలమయం..!
Hyderabad Rains: హైదరాబాద్లో వరుణుడి శాంతించడం లేదు. మళ్లీ ఏకధాటిగా వర్షం కురుస్తోంది.
Hyderabad Rains: భాగ్యనగరంలో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. ఉదయం పూట ఎండ పెడుతున్నా..సాయంత్రం వేళల్లో వర్షం కురుస్తోంది. నిన్నటిలాగే ఇవాళ కూడా భారీ వర్షం కురుస్తోంది. గంట నుంచి ఏకధాటిగా వాన పడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కూకట్‌పల్లి, ప్రగతి నగర్, గాజుల రామారాం, నాంపల్లి, సైఫాబాద్, ఖైరతాబాద్, కోఠి, గోషామహల్, హెటెక్ సిటీ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
నాంపల్లి, సోమాజిగూడ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, మెహదీపట్నం, బాబుల్ రెడ్డి నగర్, కాటేదాన్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. హైదరాబాద్ ఉత్తర ప్రాంతాల్లో రాగల గంటపాటు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిన్న కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
రాగల మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం..ఇవాళ వాయవ్య, దాని పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు కేంద్రీకృతమైంది. అక్టోబర్ 1న ఈశాన్యం దాని ఆనుకుని ఉన్న తూర్పు-మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి తెలంగాణవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుంది. అక్కడక్కడ ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. మొన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
Also read:SBI Jobs: బ్యాంక్ అభ్యర్థులకు అలర్ట్..వెంటనే ఎస్‌బీఐ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి..!
Also read:CM Jagan: పశువులన్నింటికీ బీమా సదుపాయం..సీఎం జగన్ సరికొత్త నిర్ణయం..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి