Hyderabdad Rains: తెలంగాణ రాష్ట్రానికి  హైదరాబాద్ వాతావరణ అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఉపరితల ఆవర్తనం, బలమైన నైరుతి రుతుపవనాల వల్ల రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ రోజు  హైదరాబాద్‌లో తెల్లవారు జామున కారు మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో  ఒక్కసారిగా వర్షం కురవడం ప్రారంభం అయింది. ముఖ్యంగా  జూబ్లిహిల్స్‌, కృష్ణా నగర్‌, యూసప్‌ గూడ, బంజారాహిల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు ఉప్పల్, పోచారం, మల్లాపూర్, మల్కాజ్ గిరి, హబ్సిగూడ, ఓల్డ్ సిటీ, ఎల్. బి.నగరర్, తార్నాకా ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే  ఛాన్స్ ఉందని  వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రధానంగా భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, నారాయణపేట, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్,  ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, నిర్మల్, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే  అవకాశం ఉందన్నారు.ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ అధికారులు.


ఇక భారీ వర్షాలకు తోడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం లేకపోలేదన్నారు. బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని చెప్పారు. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలున్నాయి.  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలపైకి క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ మేఘాల వల్ల ఉరుములు, మెరుపులు కూడా వస్తాయన్నారు. నల్లమబ్బు కమ్ముకుంటుందని.. పిడుగులు పడే అవకాశం కూడా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన సూచించారు.


ఇదిలా ఉండగా.. గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ మాసంలో వర్షాలు అంతగా కురవకపోయినా.. జులై చివరి వారం నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, జలాశయాలు, ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. దాదాపు రెండేళ్ల తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇలా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేయటంతో ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు.


Also Read: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..


Also Read: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter