Hyderabad Rains Today: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. ఈదురు గాలులతో భారీ వాన! వడగండ్ల హెచ్చరికలు
IMD Warns of Intense Rainfall in Telangana and Telangana Till May 3. హైదరాబాద్ నగరాన్ని మరోసారి వరుణుడు ముంచెత్తాడు. నేటి ఉదయం 5 గంటల నుంచే వర్షం మొదలైంది.
Hail Strom Rain hits Telangana and Hyderabad: హైదరాబాద్ నగరాన్ని మరోసారి వరుణుడు ముంచెత్తాడు. నేటి ఉదయం 5 గంటల నుంచే వర్షం మొదలైంది. పొద్దుపొద్దున్నే ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం పడుతోంది. భారీ వర్షానికి జంట నగరాలు మొత్తం తడిచి ముద్దయ్యాయి. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం నగంరంలోని పలు ప్రాంతాల్లో కురుస్తోంది. దాంతో ఉదయమే హైదరాబాద్ నగరంలోని రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
లక్డీకాపూల్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అత్తాపుర్, మెహిదీపట్నం, అమీర్ పేట, ఎర్రగడ్డ, సైదాబాద్, రాజేంద్రనగర్, సంతోష్ నగర్, కూకట్‌పల్లి, ఉప్పల్, తార్నాక, అంబర్ పేట్, ఎల్బీ నగర్, దిల్ షుక్ నగర్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. నగర శివారు జిల్లాల్లోనూ వర్ష ప్రభావం ఉంది. ఈదురు గాలులతో భారీ వర్షం పడుతోంది. దాంతో ఉదయం పనుల కోసం వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక నేడు వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణ వ్యాప్తంగా మరో 4-5 రోజుల పాటు భారీ వర్షాలు, వడగండ్ల వానలు ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం హైదరాబాద్ నగరం వానకి తడిచి ముద్దైంది. తెల్లవారినా కూడా మబ్బులు కమ్ముకుని చిమ్మచీకట్లు అలుముకొని ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. మరో మూడు గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ముడు రోజులుగా కూరిసిన వడగండ్ల వానలు రైతులను పూర్తిగా నీట ముంచింది. కొతకు వచ్చిన వరి పంట ఇప్పటికే నేలరాలి పోయింది. దాంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇక కోనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం నీటి మునిగి తడిసి ముద్దైంది. ఈ అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కామారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, జనగాం, రాజన్న సిరసిల్ల, మెదక్, సంగారెడ్డి, వరంగల్, వికారాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో రైతులు వర్షాలకు తీవ్రంగా నష్టపోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.