Heavy Rains lashesh in Hyderabad Today: హైదరాబాద్‌ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. వేసవి కాలంలో మండుటెండలతో ఇబ్బందిపడుతున్న నగర వాసులను వరుణుడు పలకరించాడు. సోమవారం (ఏప్రిల్ 17) సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పలు చోట్ల వడగళ్ల వాన కూడా పడుతోంది. హైదరాబాద్‌ నగరంలోని అబిడ్స్‌, బషీర్‌ బాగ్‌, నాంపల్లి, కోఠి, హైకోర్టు, గోషామహల్, బేగంబజార్‌ ఇలా పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం పడుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంచల్‌గూడ, సైదాబాద్‌, చంపాపేట, నారాయణగూడ, హిమాయత్‌ నగర్‌, లిబర్టీ, హైదర్‌గూడ, పంజాగుట్ట, సోమాజిగూడ, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో సోమవారం సాయత్రం వర్షం కురిసింది. కొన్నిచోట్ల వడగండ్ల వాన కురుస్తోంది. దాంతో వాహనాలు అద్దాలు స్వల్పంగా డామేజ్ అయ్యాయి. హైదరాబాద్‌ (Hyderabad Rains) నగర శివారుతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ పలు చోట్ల వర్ష ప్రభావం ఉన్నట్లు వాతవరణ శాఖ తెలిపింది.



ఉన్నపళంగా వర్షం పడడంతో పనుల నిమ్మితం బయటకు వెళ్లిన వాహనదారులు, పాదచారులు తడిసిముద్దయ్యారు. పలుచోట్ల రహదారులపై నీరు నిల్వడంతో.. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారు. మరోవైపు వేసవి కాలంలో మండుటెండలతో ఇబ్బందిపడుతున్న నగర వాసులకు ఈ వర్షంతో ఉపశమనం కలిగింది. వాతావరణం చల్లగా ఉండడంతో ఎందరూ ఎంజాయ్ చేస్తున్నారు. 



Also Read: Sunil Gavaskar-MS Dhoni: ఎంఎస్ ధోనీ లాంటి కెప్టెన్‌ లేడు.. భవిష్యత్తులో కూడా రాడు: సునీల్ గవాస్కర్  


Also Read: Shriya Saran Hot Pics: తల్లయ్యాక ఇలా తయారయిందేంటి.. హద్దులు దాటి అందాలు ఆరబోసిన శ్రియా సరన్! షాకింగ్ స్టిల్స్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.