Hyderabad Drugs Case: హైదరాబాద్ రేవ్ పార్టీ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై వేటు పడింది. బంజారాహిల్స్ సీఐ శివచంద్ర సస్పెన్షన్‌కు గురయ్యారు. అదే పీఎస్‌కి చెందిన ఏసీపీ సుదర్శన్‌కు మెమో జారీ అయింది. తెల్లవారుజాము వరకు పబ్ నడిచినా నిర్వాహకులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలతో వీరిపై వేటు వేసినట్లు తెలుస్తోంది. ఇదే పబ్‌పై గతంలోనూ ఫిర్యాదులు అందినప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సీఐ, ఏసీపీలను  వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్‌లోని ఫుడింగ్ మింక్ పబ్‌పై నిన్న రాత్రి పోలీసులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. రేవ్ పార్టీ సమాచారంతో పబ్‌పై దాడి చేసిన పోలీసులు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్నవారిలో కొందరు పోలీసులను చూసి డ్రగ్స్ ప్యాకెట్స్‌ను కిటికీల్లో నుంచి బయటకు విసిరేయగా పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో పబ్‌లో ఉన్న 150 మందిని అదుపులోకి తీసుకున్నారు.


పట్టుబడిన యువతీ యువకులంతా బడా బాబుల పిల్లలేనన్న వాదన ఉంది. ఇప్పటికైతే సింగర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా డాటర్ నిహారిక, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుల పేర్లు ఈ వ్యవహారంలో బయటకొచ్చాయి. అయితే అంజన్ కుమార్ యాదవ్, నిహారిక తమ పిల్లలపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్నారు. పబ్‌లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. 


Also Read: Hyderabad Drugs Case: నిజానిజాలు తెలుసుకోకుండా నన్నెందుకు బద్నాం చేస్తున్నారు.. మీడియాపై నటి హేమ ఫైర్... 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook