Hyderabad Drugs Case: నిజానిజాలు తెలుసుకోకుండా నన్నెందుకు బద్నాం చేస్తున్నారు.. మీడియాపై నటి హేమ ఫైర్...

Actres Hema on Drugs Case: సంచలనం రేపుతోన్న హైదరాబాద్ డ్రగ్స్ కేసులో తన పేరు బయటకు రావడంపై సినీ నటి హేమ స్పందించారు. డ్రగ్స్ కేసుతో తనకెటువంటి సంబంధం లేదన్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 3, 2022, 02:58 PM IST
Hyderabad Drugs Case: నిజానిజాలు తెలుసుకోకుండా నన్నెందుకు బద్నాం చేస్తున్నారు.. మీడియాపై నటి హేమ ఫైర్...

Actres Hema on Drugs Case: సంచలనం రేపుతోన్న హైదరాబాద్ డ్రగ్స్ కేసులో తన పేరు బయటకు రావడంపై సినీ నటి హేమ స్పందించారు. డ్రగ్స్ కేసుతో తనకెటువంటి సంబంధం లేదన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా మీడియాలో తన పేరును ఎలా ప్రస్తావిస్తారంటూ మండిపడ్డారు. ఓ ప్రముఖ టీవీ చానెల్‌లో తన పేరును ప్రస్తావించారన్న విషయం తెలుసుకున్న హేమ ఆదివారం (ఏప్రిల్ 3) బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నటి హేమ... రేవ్ పార్టీ జరిగిన పబ్‌లో తాను లేనని స్పష్టం చేశారు.  అనవసరంగా తన పేరును బద్నాం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తన పేరు ప్రస్తావించిన టీవీ రిపోర్టర్‌కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపారు. సదరు రిపోర్టర్ తన పట్ల దురుసుగా మాట్లాడారని ఆరోపించారు. అతని ఫోన్ కాల్ రికార్డింగ్ కూడా తన వద్ద ఉందన్నారు. మహిళ అని కూడా చూడకుండా... నిజానిజాలు తెలుసుకోకుండా మీడియాలో తన పేరును ప్రచారం చేయడం సరికాదన్నారు. 

ఇదే డ్రగ్స్ కేసులో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్ పేరు కూడా వినిపించగా.. అంజన్ కుమార్ ఆ ఆరోపణలను ఖండించారు. అదంతా అసత్య ప్రచారమని కొట్టిపారేసిన అంజన్ కుమార్... నగరంలో పబ్స్‌ను మూసివేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే కేసులో మెగా డాటర్ నిహారిక కొణిదెల, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌ల పేర్లు కూడా బయటకొచ్చిన సంగతి తెలిసిందే. నిహారిక పోలీస్ స్టేషన్ నుంచి బయటకొస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డ్రగ్స్ కేసులో నిహారిక పాత్రపై ఇప్పటికైతే మెగా ఫ్యామిలీ నుంచి ఎటువంటి స్పందన లేదు. పోలీసుల విచారణలో ఈ కేసులో మరిన్ని సంచలనాలు వెల్లడయ్యే అవకాశం లేకపోలేదు. 

Trending News