హైదరాబాద్: హైదరాబాద్ లో గత కొంతకాలంగా మందకోడిగా కొనసాగుతున్న అమ్మకాలు కొనుగోలు వ్యవహారం మళ్ళీ ఊపందుకున్నాయని రియల్ నిపుణులు పేర్కొంటున్నారు. కారణం ఏపీలో మూడు రాజధానుల ప్రకటనతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుందన్నారు. ఇప్పటికే పెట్టుబడుల వెల్లువ కొనసాగుతున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా, ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి మూడు రాజధానుల వ్యవహారంతో మరోసారీ రియల్ భూమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. 


మరోవైపు ఇదే అంశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు ఏపీ సీఎం జగన్‌కు ధన్యవాదాలు చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్, చంద్రబాబు ఇద్దరూ దొంగలేనని ఆయన విమర్శించారు. అటు బీజేపీ పార్టీపైనా ఆయన ఆరోపణలు చేశారు. భారతీయ పార్టీని ప్రశ్నించేవారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉగ్రవాద బడ్జెట్ అని ఆయన అభివర్ణించారు. తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీ జరుగుతోందని, విపక్షాలపై దాడులు పెరిగాయని ఆయన ఆరోపించారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..