Hyderabad Weather Report: హైదరాబాద్ నగరంలో భానుడి ఉగ్రరూపం.. ఈ ఆరు ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఎండలు
Hyderabad Temperatures Today: హైదరాబాద్‌లో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని ఆరు ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగరవాసులు బయటకు వచ్చేందుకు భయపడిపోయారు. గత ఏడాది కంటే ఈసారి మరింతగా ఎండలు పెరిగాయి.
Hyderabad Temperatures Today: హైదరాబాద్ నగరంలో భానుడి ప్రతాపానికి ప్రజలు తీవ్ర ఇబ్బందుకు గురవుతున్నారు. శుక్రవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటల నుంచే మిట్ట మధ్యాహ్నం తలపించేలా ఎండలు మొదలయ్యాయి. ఇక మిట్టమధ్యాహ్నానికి నిప్పుల కొలిమిలా మారింది. నగరంలోని ఆరు ప్రాంతాలలో మధ్యాహ్నానికి 42 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ పర్యవేక్షణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మియాపూర్ హాటెస్ట్ స్పాట్‌గా 42.7 డిగ్రీల సెల్సియస్‌ను నమోదు చేసిందని చెప్పారు. బోరబండలో 42.5 డిగ్రీల సెల్సియస్, షేక్‌పేట 42.4 డిగ్రీల సెల్సియస్‌కు దగ్గరగా ఉందన్నారు. కూకట్‌పల్లిలోని బాలాజీ నగర్, కుత్‌బుల్లాపూర్‌లోని ఆదర్శ్ నగర్‌లో 42.4 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో 42 డిగ్రీల సెల్సియస్ నమోదైందని తెలిపారు. ఎండలు గత ఏడాది కంటే ఈసారి మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోయే పరిస్థితి నెలకొంది.
Also Read: Weight Loss Surgery: ప్రాణం తీసిన 'అధిక బరువు శస్త్ర చికిత్స'.. వయసు 26 ఏళ్లు బరువు 150 కిలోలు
రోజంతా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. నగరవ్యాప్తంగా ఎండలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. తీవ్రమైన వేడి కొనసాగుతున్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని.. హైడ్రేటెడ్‌గా ఉండాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని అంటున్నారు. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశముందన్నారు. పొడి వాతావరణం కారణంగా
ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందన్నారు. అయితే ఆదివారం అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.
ద్రోణి విచ్చిన్నతి ఒకటి మరాత్వాడ నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ.ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న దక్షిణ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడిందన్నారు. నిన్న ఏర్పడిన ఆవర్తనం నుంచి విదర్భ, మరాత్వాడ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగిన ద్రోణి విచ్చిన్నతి ఈరోజు బలహీనపడిందని చెప్పారు. ఈ రోజు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఎల్లుండి రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మొస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడ అక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
Also Read: Renault Kiger Price: టాటా పంచ్‌తో పోటీ పడుతున్న Renault Kiger.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి