Cold intensity Increase in Hyderabad: హైద‌రాబాద్‌ నగరంను మరోసారి చలి వణికిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన చలి తీవ్రత.. మళ్లీ వణుకు పుట్టిస్తోంది. గత మూడు నాలుగు రోజులుగా సాధారణ స్థాయి దాటి నమోదైన రాత్రి ఉష్ణోగ్రతలు సోమవారం (డిసెంబర్ 6) ఒక్కసారిగా పడిపోయాయి. గత మూడు రోజులుగా 21, 20.2, 21.0 డిగ్రీలుగా నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు.. సోమవారం 16.7 డిగ్రీలుగా నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తీవ్ర‌మైన చ‌లి ఉండ‌టంతో హైద‌రాబాద్‌ న‌గ‌ర వాసులు ఉదయం బ‌య‌ట‌కు రావాలంటేనే వణికిపోతున్నారు. పిల్ల‌లు, వృద్ధులు చ‌లిని త‌ట్టుకోలేక ఇంటికే ప‌రిమిత‌మవుతున్నారు. హైద‌రాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 30.6 డిగ్రీల సెల్సియస్‌, గాలిలో తేమ 35 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భాగ్యన‌గ‌రంలోని వృద్ధులు, పిల్ల‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారులు సూచించారు. తప్పనిసరి అయితేనే ఉదయం బయటకు రావాలని పేర్కొన్నారు. 


మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడుతుందనుకుంటున్న వాయుగుండం.. తుపానుగా మారి తమిళనాడు–దక్షిణ కోస్తాంధ్ర వైపు పయనించనుంది. దీని ప్రభావం ఏపీపై కూడా పడనుంది. దక్షిణ అండమాన్‌ సముద్రం పరిసరాల్లో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ నేటి సాయంత్రానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. గురువారం ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి–దక్షిణ కోస్తాంధ్ర సమీపంలో తీరానికి చేరుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. 


తుపాను ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఎక్కువగా ఉండనుంది. రాబోయే 2-3 రోజులు దక్షిణ కోస్తాలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక డిసెంబర్ 15వ తేదీన అండమాన్‌ సముద్రం లేదా దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం 20వ వరకు ఉండే అవకాశం ఉంది. దీని కారణంగా చలి తీవ్రత కూడా మరింత పెరగనుంది. 


Also Read: Horoscope Today 6 December 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు శుభవార్తలను వింటారు!  


Also Read: Adivi Sesh Lady Fan: మొన్న డేటన్నది, ఇప్పుడు డిలీట్ చేయమంటోంది..వారి కంట పడితే అంతే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.