Suicide: నా భర్త సైకో, శాడిస్ట్-పిల్లలతో సహా వివాహిత ఆత్మహత్య-గోడపై సూసైడ్ నోట్
Married woman commits suicide with two kids: భర్త తీరుతో విసిగిపోయి, అతని వేధింపులను భరించలేక ఓ వివాహిత తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Married woman commits suicide with two kids: హైదరాబాద్ (Hyderabad) రాజేంద్రనగర్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఇంట్లోని గోడపై బలవన్మరణానికి (Suicide) గల కారణాలను రాసింది. తన భర్త ఒక సైకో, శాడిస్ట్ అని అందులో పేర్కొంది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో భర్త ఇంట్లోనే ఉండటం గమనార్హం. మరోవైపు, తమ కూతురు, పిల్లలను అల్లుడే హత్య చేశాడని మృతురాలి తల్లి ఆరోపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే... ఏపీలోని రాజమండ్రికి చెందిన స్వాతి కుసుమ (32), హైదరాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన సాయి కుమార్ (32) ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంజనీరింగ్ చదివే సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. కుసుమ సోదరి దగ్గరుండి వీరి వివాహం (Love Marriage) జరిపించింది.
పెళ్లి తర్వాత కొత్త జంట కొన్నాళ్లు యూసుఫ్‌గూడలో ఉన్నారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేసేవారు. కొద్దిరోజులకు కుసుమ గర్భం దాల్చడంతో ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. ఇదే క్రమంలో యూసుఫ్‌గూడ నుంచి రాజేంద్రనగర్‌లోని (Rajendra Nagar) ఫోర్ట్ వ్యూకాలనీకి షిఫ్ట్ అయ్యారు. ఈ దంపతులకు తన్విక్ (4), శ్రేయ (3) ఇద్దరు పిల్లలు. కొన్నేళ్లు సాఫీగానే సాగిన వీరి కాపురంలో కొన్నాళ్లుగా గొడవలు మొదలయ్యాయి.
సాయి తాను చేసిన అప్పులను భార్య కుసుమను తీర్చమని గొడవపెట్టేవాడు. దీంతో కుసుమ తల్లి అతనికి రూ.2.50 లక్షలు అప్పు ఇప్పించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం (డిసెంబర్ 10) ఆఫీస్‌కు వెళ్లిన సాయి శనివారం తెల్లవారుజామున 5గంటలకు తిరిగొచ్చాడు. హాలులో నిద్రపోయిన అతను... సాయంత్రం సమయంలో నిద్ర లేచాడు. బెడ్‌రూమ్‌లో భార్య, పిల్లల అలికిడి లేకపోవడంతో తలుపు తట్టాడు. ఎంతకీ స్పందన లేకపోవడంతో తలుపులు పగలగొట్టాడు. కానీ అప్పటికే స్వాతి, ఇద్దరు పిల్లలు విగతజీవులుగా (Married woman commits suicide) కనిపించారు. ఈ విషయాలను సాయి పోలీసులకు వెల్లడించాడు.
సాయి చెబుతున్న విషయం నమ్మశక్యంగా లేదని మృతురాలి కుటుంబ సభ్యులు అంటున్నారు. స్వాతి, పిల్లలను అతనే హత్య (Murder) చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. సాయి వేరే మహిళకు దగ్గరవడంతో కొన్నాళ్లుగా స్వాతికి, సాయికి మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పారు.
నా భర్త సైకో, శాడిస్ట్... స్వాతి సూసైడ్ నోట్:
ఆత్మహత్యకు ముందు స్వాతి ఇంట్లోని గోడపై బలవన్మరణానికి (Suicide) గల కారణాలను రాసింది. 'నా భర్త ఒక సైకో.. శాడిస్ట్... ఊరంతా అప్పులు... ఉన్న బంగారమంతా అమ్మేశాడు. అతని అనుమానాలను తట్టుకోలేకపోతున్నాను. మా అక్కాచెల్లెళ్లను కూడా తప్పుగా చూస్తాడు. సాయి నువ్వు చేసింది, చేస్తోంది ఒకసారి ఆలోచించుకో. పిల్లలకు, నాకు నువ్వేం చేశావ్... కనీసం ఒక జత బట్టలు కొన్నావా... పిల్లలకు నేనంటే పిచ్చి. నేను లేనిదే వాళ్లను ఎవరూ చూసుకోరు. అందుకే నాతో పాటే తీసుకెళ్తున్నా.' అని స్వాతి గోడపై రాసిన సూసైడ్ నోట్‌లో పేర్కొంది.
Also Read: Jyotirlinga Darshan2022 : కొత్త సంవత్సరంలో రైల్వే నుంచి మంచి టూర్ ఆఫర్, ఏడు జ్యోతిర్లింగాల యాత్ర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook