Jyotirlinga Darshan2022 : కొత్త సంవత్సరంలో రైల్వే నుంచి మంచి టూర్​ ఆఫర్, ఏడు జ్యోతిర్లింగాల యాత్ర

Jyotirlinga Darshan offer : ఐఆర్సీటీసీ ఒక మంచి ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా దేశంలోని ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. అలాగే స్టాచ్యూ ఆఫ్ యూనిటీని (Statue of Unity) కూడా సందర్శించవచ్చు. https://www.irctctourism.com/

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 11, 2021, 10:57 PM IST
  • న్యూ ఇయర్‌‌లో ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా..
  • ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ నుంచి మంచి ప్యాకేజీ
  • దేశంలోని ఏడు జ్యోతిర్లింగాలు, స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శించుకునే అవకాశం
Jyotirlinga Darshan2022 : కొత్త సంవత్సరంలో రైల్వే నుంచి మంచి టూర్​ ఆఫర్,  ఏడు జ్యోతిర్లింగాల యాత్ర

IRCTC’s Jyotirlinga darshan train to start on January 2022 Check fares, routes other details : కొత్త సంవత్సరం మరికొన్ని రోజుల్లో రానుంది. న్యూ ఇయర్‌‌లో ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ ప్లాన్ మీ కోసమే. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఒక మంచి ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా దేశంలోని ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. అలాగే స్టాచ్యూ ఆఫ్ యూనిటీని (Statue of Unity) కూడా సందర్శించవచ్చు. 

భారత్ దర్శన్ స్పెషల్ టూరిస్ట్ రైలు దేశంలోని అన్ని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను కవర్ చేస్తూ ఉంటుంది. అందుకు సంబంధించి టూర్ ప్యాకేజీలలో ఇది ఒకటి. ఐఆర్‌‌సీటీసీ వెబ్‌సైట్ www.irctctourism.com లో ఈ ప్యాకేజీకి సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. ఈ టూర్ ప్యాకేజీ (Tour package) టికెట్స్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. లేదంటే ఐఆర్సీటీసీ (IRCTC) టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్‌‌లలో, స్థానిక కార్యాలయాల్లో కూడా టికెట్స్ బుకింగ్ (Booking tickets) చేసుకోవచ్చు. 

ఏడు జ్యోతిర్లింగాలతో (Seven Jyotirlingas) పాటు స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రయాణానికి సంబంధించిన జర్నీ 2020 జనవరి 4న ప్రారంభం అవుతుంది. ఈ పూర్తి టూర్ (Full Tour) దాదాపు 12 రోజుల పాటు ఉంటుంది. భారత్ దర్శన్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్.. జనవరి 04, 2022న గోరఖ్‌పూర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రయాణికులు గోరఖ్‌పూర్ లేదంటే డియోరియా సదర్.. బెల్తరా రోడ్, వారణాసి, భదోహి అలాగే ఝంఘై, ప్రయాగ్‌రాజ్ సంగం, ప్రతాప్ గడ్, గౌరీగంజ్, రాయ్ బరేలీ, లక్నో, కాన్పూర్, ఝాన్సీ స్టేషన్‌లలో ఎక్కడైనా ఎక్కొచ్చు. 

Also Read :Crazy Offer: రూ.20,990 ధర గల Oppo Mass 5G స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 2,000కే.. త్వరపడండి!

ఇక ఈ టూర్‌‌లో ఉజ్జయిని, సోమనాథ్, వడోదర, ద్వారక, పర్లి వైజనాథ్, పూణే, ఔరంగాబాద్, నాసిక్ రోడ్ తదితర ప్రాంతాలను కవర్ చేస్తారు. ఈ టూర్ ప్యాకేజీ కోసం 12,285 రూపాయలు టికెట్ ధర ఉంటుంది. ఇందులో ఛార్జీలో జీఎస్టీ కూడా యాడ్ చేశారు. అయితే ఈ ప్రయాణానికి కోవిడ్ 19 (Covid 19) వ్యాక్సినేషన్  (Vaccination) సర్టిఫికేట్ తప్పనిసరి.

Also Read :Amazon mobile sale: అమెజాన్ భారీ ఆఫర్​- రూ.48 వేల స్మార్ట్​ఫోన్ రూ.27 వేలకే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News