Hyderabad Weather Alert: హైదరాబాద్‌ వాతావరణ శాఖ ప్రజలకు చల్లని కబురు అందించింది. భగభగ మండే భానుడి నుంచి కాస్త బ్రేక్‌ దొరకనుంది. రానున్న రెండు నుంచి మూడు రోజులపాటు ఉరుములతో కూడిని తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇది తెలంగాణ ప్రజలకు ఎండ వేడిమి నుంచి చల్లని ఉపశమనం లభించనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈరోజు, రేపు తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాలలో వడగాల్పులు తీవ్రంగా వీస్తున్నాయి. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వడగాలులు కింది స్థాయి గాలులు వీస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.


రాగల మూడు రోజులకు సంబంధించిన వాతావరణ పరిస్థితులను హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈరోజు ఆదివారంతోపాటు రేపు, ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతేకాదు ఈ రెండు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది.


ఇదీ చదవండి:  రేవంత్‌కు హైకమాండ్ ఝలక్.. 12 మంది BRS ఎమ్మెల్యేల చేరికకు బ్రేక్..


ముఖ్యంగా ఈరోజు నుంచి మరో రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రాష్ట్ర ప్రజలకు ఎండ నుంచి హాయినిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 44 డిగ్రీల ఎండ వేడిమితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.


ఇదీ చదవండి: ఖమ్మం జిల్లా ఖానాపురంలో రెచ్చిపోయిన వాహన ఫైనాన్సర్లు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook