Hydra: హైడ్రా మరో సంచలనం.. ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు.. కారణం ఏంటంటే..?
Hydra demolitions: హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పుడిది అక్రమార్కులకు కంటి మీద కునుకు లేకుండా చేసిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు.. అక్రమ నిర్మాణాలను అనుమతులిచ్చిన వారిపై చర్యలు తీసుకున్నారు.
Hydra Hyderabad police registered criminal case against six officials: తెలంగాణలో ఇప్పుడు హైడ్రా పేరు సంచలనంగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ లో హైడ్రా అక్రమ కట్టడాల కూల్చివేతలు ప్రతిరోజు వార్తలలో ఉంటున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ హైడ్రా ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ స్థలాలు, చెరువులను ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) చుక్కలు చూపిస్తుంది. హైడ్రా కు ముఖ్య అధికారిగా సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ ను నియమించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్న కూడా హైడ్రా వెళ్లి.. కూల్చివేస్తుంది. ఈ నేపథ్యంలో.. హైడ్రా హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను సైతం కూల్చేయడంతో హైడ్రా.. పేరు ఒక్కసారిగా సంచలనంగా మారింది.ఈ నేపథ్యంలో ఇప్పటికే చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ కూడా హైడ్రాకు.. ప్రత్యేకంగా అధికారాలను సైతం కేటాయించారు. ఇటీవల తెలంగాలో హైడ్రా తీరుపట్ల ప్రజల్లో మంచి స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలపై కొంత మంది నేతలు.. హైకోర్టులకు వెళ్లి మరీ స్టేలు తెచ్చుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల హైకోర్టు సైతం.. అక్రమ కూల్చివేతలపై ప్రభుత్వంను పలు ప్రశ్నలను సంధించింది.అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్నారు.. సరే.. కానీ వీటికి అనుమతులిచ్చినవారిపై మీ చర్యలేంటీ.. అప్పుడు ఇవి గుర్తుకు రాలేదా.. అక్రమం అయిన భూమికి అప్పుడు ఎలా పర్మిషన్ లు ఇచ్చారు. ఆ ఇచ్చిన అధికారులపై మీ చర్యలేంటని కూడా ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో పలువురు అపోసిషన్ నేతలు సైతం.. కేవలం పేదవారిపైన హైడ్రా తన ప్రతాపం చూపిస్తుందని, బడా బాబులు కోర్టులకు వెళ్లి.. స్టేలు తెచ్చుకుంటున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో హైడ్రా అధికారులు ఇప్పుడు.. ఈ అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారుల భరతం పట్టే పనిలో పడినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా.. హైదరబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన ఆరుగురు అధికారులపై ప్రస్తుతం పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
సైబరాబాద్ EOW వింగ్‌లో కేసులు నమోదు చేసినట్లు సీపీ అవినాష్ వెల్లడించారు. నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుదామ్ష్, బాచుపల్లి ఎంఆర్వో పూల్ సింగ్, మేడ్చల్- మల్కాజ్‌గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్‌ల పోలీసులు తాజాగా క్రిమినల్ కేసులు నమోదు చేశారు. హైడ్రా సిఫార్సుల మేరకు ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
FTLలో అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు ఉంటాయని పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు కూడా హైడ్రా అధికారులు.. ఉదయం నగర పరిధిలోని గగన్‌పహాడ్ ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలను ప్రారంభించింది. అప్పా చెరువుకు అక్రమించి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను భారీ బందోబస్తు నడుమ హైడ్రా సిబ్బంది బుల్డోజర్లతో కూల్చివేతలు చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.