Himayat Sagar: తెలంగాణ సర్కార్ ఆదేశాలతో హైడ్రా ఎవరినీ లెక్క చేయడం లేదు. అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై కన్నెర్ర చేస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రాకు సంబంధించిన బుల్‌డోజర్లు హిమాయత్ సాగర్ వైపు కదులుతున్నాయి. వారం రోజుల్లో జలశయంలోని నిర్మాణాలను కూల్చి వేసేందుకు రంగం సిద్ధం చేశారు. జల మండలి, రెవెన్య అధికారులు ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను గుర్తించే ప్రక్రియను చేపట్టారు. ఫస్ట్ ఫేస్ లో  కొందరు సినీ, రాజకీయ ప్రముఖుల ఫామ్‌హౌస్‌లు, ఇతర నిర్మాణాలు ఇందులో ఉన్నట్టు తేలింది. అవి అక్రమమని తేలితే కూల్చివేయడం ఖాయం అని చెబుతున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్రమ నిర్మాణాల్లో  అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేతలతోపాటు ఇతర పార్టీలు, ప్రముఖుల బంగ్లాలు అందులో ఉన్నాయి. వాటి నుంచి పది భారీ నిర్మాణాలను అధికారులు ఎంపిక చేసినట్టు సమాచారం. అధికార పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రంతో పాటు ఇతర నేతల ఫామ్‌హౌస్‌లు తెరపైకి వచ్చాయి. ఆయా నిర్మాణాలు ఎఫ్‌టీఎల్‌ హద్దు లోపల ఎంత వరకు ఉన్నాయి. బఫర్‌జోన్‌ లోపల, వెలుపల ఎంత మేర ఉన్నాయనే వివరాలతో నివేదిక సిద్ధం చేసే పనిలో  హైడ్రా  ఉంది. ఇందుకు సంబంధించి జలమండలి, రెవెన్యూ అధికారులను రికార్డులను రెడీగా ఉంచమని ఆదేశించింది. వచ్చే సోమవారానికి నివేదికను పూర్తి చేస్తామని అధికారులు  హైడ్రాకు నివేదించారు.


ఈ నెల 11న గండిపేట జలాశయంలోని అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను  కూల్చివేశారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వ్యాపార వేత్తల ఫామ్‌హౌస్‌లు, హోటళ్లు, క్రీడా ప్రాంగణాలను  నేలమట్టం చేశారు. అనంతరం నగరంలోని తుమ్మిడి కుంటలో నిర్మించిన ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చింది. ఈర్లకుంట, చింతల్‌చెరువు, తదితర తటాకాల్లోని ఆక్రమణలను తొలగించారు. ఇప్పుడు హిమాయత్‌ సాగర్‌ ఆక్రమణలపైనా దృష్టిపెట్టారు. మొదటి దశలో ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని  పెద్ద బంగ్లాలను కూల్చుతామన్నారు. ఆ తర్వాత బఫర్‌జోన్‌లోని కట్టడాలను నేలమట్టం చేస్తామంటున్నారు. జలమండలితోపాటు ఇతర శాఖ అధికారులు క్షేత్రస్థాయి సమాచారంతో పాటు గూగుల్‌ మ్యాప్‌లతో అక్రమ నిర్మాణాలను గుర్తించే పనిలో హైడ్రా ఉంది.


ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..


ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.