సెలబ్రిటీలు ఏం చేసినా, ఏది ఫాలో అయినా, వారు ఏం పనులు చేస్తున్నా ప్రజలకు ఆ విషయాలపై ఎంతో కొంత ఆసక్తి ఉండటం ఉండటం ఖాయం. ఈ నేపథ్యంలో సూపర్ పోలీస్‌గా పేరున్న వీసీ సజ్జనార్ (VC Sajjanar) ఐపీఎల్ లీగ్‌పై, తన అభిమాన క్రికెటర్ ఎవరనే విషయాలపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కరోనాతో ఇంటిపట్టున ఉండటంతో ఐపీఎల్ ఫీవర్ పెరిగిపోయింది. అయితే వీలుచిక్కినప్పుడల్లా తాను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) మ్యాచ్‌లు చూస్తానని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (CP Sajjanar) తెలిపారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పనిలో బిజీగా ఉండటం వల్ల రెగ్యూలర్‌గా మ్యాచ్‌లు చూడటం వీలుకాదన్నారు. అయితే ఇంటికి వెళ్లిన తర్వాత కుటుంబంతో కలిసి కచ్చితంగా ఐపీఎల్ మ్యాచ్‌ల హైలైట్స్ చూస్తానని చెప్పారు. స్కూలు రోజుల్లో తాను క్రికెట్ ఆడానని, ఆ సమయంలోనూ క్రికెట్‌కు మన దేశంలో అతిపెద్ద క్రీడ అని పేర్కొన్నారు. సీనియర్ క్రికెటర్, భారత మాజీ కెప్టెన్ గుండప్ప (జీఆర్) విశ్వనాథ్ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారని గుర్తుచేసుకున్నారు. బాంబేలో జరిగిన మ్యాచ్‌లో బాబ్ టేలర్ అనే ప్రత్యర్థి జట్టు ఆటగాడు ఔటయ్యానని భావించి క్రీజు వదిలి వెళ్తుంటే.. అతడిని తిరిగి బ్యాటింగ్‌కు ఆహ్వానించారని ఆటగాళ్లు ఇలాగే ఉండాలంటూ  టీవీ9తో సజ్జనార్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 



తాను భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని అభిమానిస్తున్నానని చెప్పారు. ఈ వయసులోనూ ధోనీ అంతే ఉత్సాహంగా మ్యాచ్‌లు ఆడుతున్నాడరని కొనియాడారు. ఆటను చూసి ఆస్వాదించాలని, ఇష్టం ఉంటే ఆడాలని.. కానీ బెట్టింగ్స్ లాంటి వాటిక దూరంగా ఉండాలని సూచించారు. అందువల్ల ఎంతో నష్టం చేకూరుతుందని సజ్జనార్ వివరించారు. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe