KXIP vs CSK match: క్యాచ్‌లతో సెంచరీ కొట్టిన ధోనీ

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌ చరిత్రలో 100 క్యాచ్‌లు అందుకున్న రెండో వికెట్‌ కీపర్‌గా ( 100 catches as wicket keeper in IPL) రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌‌కి ( Dinesh Karthik ) మాత్రమే ఈ రికార్డు సాధ్యం కాగా తాజాగా కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ( KL Rahul ) ఇచ్చిన క్యాచ్‌ని ధోనీ డైవ్ చేసి మరీ పట్టుకోవడంతో ఈ రికార్డును కైవసం చేసుకున్నాడు.

Last Updated : Oct 5, 2020, 08:02 AM IST
KXIP vs CSK match: క్యాచ్‌లతో సెంచరీ కొట్టిన ధోనీ

దుబాయ్‌: '' మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni ) క్యాచ్‌లలో సెంచరీ కొట్టాడు. అవును ఇప్పటివరకు జరిగిన 13 సీజన్ల ఐపిఎల్ మ్యాచ్‌లలో వికెట్ కీపర్‌గా ఉంటూ ధోనీ అందుకున్న క్యాచ్‌లు సంఖ్య 100 కి చేరింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌ చరిత్రలో 100 క్యాచ్‌లు అందుకున్న రెండో వికెట్‌ కీపర్‌గా ( 100 catches as wicket keeper in IPL) రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌‌కి ( KKR captain Dinesh Karthik ) మాత్రమే ఈ రికార్డు సాధ్యం కాగా తాజాగా కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ( KL Rahul ) ఇచ్చిన క్యాచ్‌ను ధోనీ డైవ్ చేసి మరీ పట్టుకోవడంతో ఈ రికార్డును కైవసం చేసుకున్నాడు. Also read : KXIP vs CSK Highlights: ఇరగదీసిన వాట్సన్(83), డుప్లెసిస్‌(87).. చెన్నై సూపర్ విక్టరీ

ఐపిఎల్ చరిత్రలో 186 మ్యాచ్‌లు ఆడి 103 క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్‌ ( Dinesh Karthik ) తొలి స్థానంలో ఉన్నాడు. 195 మ్యాచ్‌లతో 100 క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్‌గా ఇప్పుడు ధోనీ రెండో స్థానంలో ఉన్నాడు. దినేశ్ కార్తిక్, ధోనీలకు దరిదాపుల్లో ఏ క్రికెటర్ లేడు. ఈ ఇద్దరి తర్వాత అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్లలో పార్థివ్ పటేల్ (66), నమాన్ ఓజా (65), రాబిన్ ఊతప్ప (58) ఉన్నారు. 

ఇదిలావుంటే, ఐపీఎల్‌లో అత్యధిక సంఖ్యలో ఆటగాళ్లను ఔట్ చేసిన వికెట్‌ కీపర్ల జాబితాలో మాత్రం దినేశ్ కార్తిక్ కంటే ధోనీనే అగ్ర స్థానంలో ఉన్నాడు. క్యాచ్‌లు, స్టంపౌట్‌లతో ( Most stump outs ) కలిపి ధోనీ 139 మంది ఆటగాళ్లను ఔట్ చేయగా.. దినేశ్ కార్తీక్‌ 133 మందిని ఔట్ చేసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. Also read : MS Dhoni IPL records: ధోనీ ఖాతాలో మరో ఐపిఎల్ రికార్డు

ఐపిఎల్‌ 2020లో భాగంగా ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ( Kings XI Punjab ) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ సేన 10 వికెట్ల తేడాతో  గెలిచి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News