Governor Tamilisai: అమిత్ షాతో తమిళిసై భేటీ... ఏం మాట్లాడానో బయటికి వెల్లడించలేనన్న గవర్నర్...
Governor Tamilisai Meets Amit Shah: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఇవాళ కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె రాష్ట్ర ప్రభుత్వం తన పట్ల వ్యవహరిస్తున్న తీరుపై మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Governor Tamilisai Meets Amit Shah: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఉన్నట్టుండి గవర్నర్‌ను ఢిల్లీకి రావాలని కేంద్రం కబురు పెట్టడంతో అసలేం జరుగుతోందన్న చర్చ మొదలైంది. కొంతకాలంగా గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అన్నట్లుగా తెలంగాణలో పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో గవర్నర్‌ను కేంద్రం ఆగ మేఘాల మీద ఢిల్లీకి పిలిపించడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ పర్యటనలో తాజాగా కేంద్ర హోంమత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు గవర్నర్. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హోంమంత్రి అమిత్ షాతో భేటీలో ఏం చర్చించానో బయటకు వెల్లడించలేనని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే తాను ఆలోచిస్తానని... వారికి మేలు జరిగేలా హోంమంత్రితో చర్చించానని అన్నారు. తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని... తనకు ఎవరి నుంచి ఎలాంటి సహకారం అందకపోయినా పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్తానని స్పష్టం చేశారు.
తాను రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నానని... అందరితోనూ స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తిని అని తమిళిసై పేర్కొన్నారు. ఈ నెల 10న భద్రాచలంలో జరిగే శ్రీరామ నవమి ఉత్సవాలకు హాజరవుతానని తెలిపారు. రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా భద్రాచలం వెళ్తానన్నారు. మేడారం జాతర సమయంలో రోడ్డు మార్గంలోనే ఐదు గంటల పాటు ప్రయాణించి అక్కడికి చేరుకున్నానని అన్నారు.
రాజ్‌భవన్‌కు ఏ పార్టీతోనూ సంబంధం లేదని... గత రెండేళ్లలో తాను బీజేపీ నేతలను కేవలం ఒకటి, రెండు సార్లు మాత్రమే కలిశానని తమిళిసై పేర్కొన్నారు. ఉగాది ఉత్సవాలకు ఆహ్వానం పంపితే ప్రభుత్వం తరుపున ఎవరూ హాజరుకాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యక్తిగా తనను గౌరవించకపోయినా... రాజ్‌భవన్‌ను, గవర్నర్ పదవిని గౌరవించాలన్నారు. తానెవరినీ విమర్శించడం లేదని... అయితే ఒక మహిళను గౌరవించే విధానం మాత్రం ఇది కాదని అన్నారు.
కాగా, కొన్నాళ్లుగా రాజ్‌భవన్‌కు, ప్రగతి భవన్‌కు మధ్య గ్యాప్ పెరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే తమిళిసై దాన్ని తిరస్కరించారు. అది ప్రభుత్వానికి మింగుడు పడలేదు. పైగా ప్రజా దర్బార్ నిర్వహిస్తానని గవర్నర్ నిర్ణయించడంతో సమాంతర పాలన అంటూ ప్రభుత్వ పెద్దలు కౌంటర్ ఎటాక్ చేశారు. ఈ క్రమంలో పలు సందర్భాల్లో ప్రభుత్వం గవర్నర్ ప్రోటోకాల్‌ను పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఇలా గ్యాప్ అంతకంతకూ పెరుగుతోన్న తరుణంలో తమిళిసై ఢిల్లీకి పయనమవడం కేంద్ర పెద్దలతో భేటీ అవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read: MIM Corporator: ఎస్సైపై అరుస్తూ వాగ్వాదం... రెచ్చిపోయిన మరో ఎంఐఎం కార్పోరేటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook