Telangana Rain Alert: తెలంగాణను వదలని వరుణుడు.. మరో రెండు రోజులు కుండపోత వర్షం
Telangana Rain Alert: తెలంగాణపై వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం కూల్ గా ఉంది. ముసురు పట్టింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా చిరు జల్లులు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
Telangana Rain Alert: తెలంగాణపై వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం కూల్ గా ఉంది. ముసురు పట్టింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా చిరు జల్లులు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రానున్న మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఉత్తర బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా ప్రాంతంలో కేంద్రీకృతమైందని తెలిపింది.ఈ వాయుగుండం రానున్న ఆరు గంటలలో పశ్చిమ వాయవ్య దిశగా కదిలి పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రంవెల్లడించింది.వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల మోస్తరు వర్షాలతో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదారాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
ఆదివారం కొమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల్ జిల్లా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మ, మహబూబ్ బాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తుందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక సోమవారం ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ హెచ్చరికలతో అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Read Also: Srinivas Goud: మంత్రి గన్ ఫైర్ చేసినా డీజీపీ మౌనం? ఆ పోస్ట్ కోసమేనంటూ బీజేపీ ఫైర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి