Telangana Rains Alert: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చల్లనివార్త ఇది. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ ఉపరితలంపై ఏర్పడిన క్యుమిలోనింబస్ మేఘాలు..ఎండల నుంచి ఉపశమనం కల్గించనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 4 రోజులపాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.


ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, కర్ణాటక వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడి చల్లని గాలులు వీస్తున్నాయి. కర్ణాటకపై 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఫలితంగా రాష్ట్రంలో నాలుగు రోజులపాటు మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే వికారాబాద్, రంగారెడ్డి, గద్వాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. వేగంగా ఏర్పడుతున్న క్యుమిలోనింబస్ మేఘాల కారణంగా గంటల వ్యవధిలోనే భారీ వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్ జిల్లా కోటిపల్లిలో అత్యధికంగా 9.7 సెంటీమీర్ల వర్షపాతం నమోదవగా..దుద్యాలలో 9.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 


ఉపరితల ద్రోణి కారణంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణం కంటే 7 డిగ్రీలు తక్కువ నమోదైంది. మరోవైపు బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకూ నైరుతి రుతుపవనాలు విస్తరించి కన్పిస్తున్నాయి.


Also read: Pawan Kalyan: బీజేపీతో పొత్తు లేనట్టేనా! జనసేన గెలిచే సీట్లు ఇవేనా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook