Telangana Rain Alert :  తెలంగాణను వదల బొమ్మాళి అంటున్నాడు వరుణుడు. గత వారం రోజులుగా కుమ్మేస్తున్నాడు. రోజూ మధ్యాహ్నం ఎండ దంచి కొట్టడం.. సాయంత్రానికి వర్షం రావడం కామన్ గా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. గంటల్లోనే ఐదు నుంచి 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. తాజాగా మరో వారం రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రవారం ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తుందని వెల్లడించింది. మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. జనాలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటికి వెళ్లొద్దని హెచ్చరించింది.


గత 24 గంటల్లో జనగామ జిల్లా కొడకండ్లలో అత్యధికంగా 120 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో 97, నందనంలో 97, మహబూబ్ నగర్ లో 87, వికారాబాద్ జిల్లా ముజాహిద్ పూర్ లో 86, జనగామ జిల్లా దేవరుప్పలలో 84 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా దోమలో 84, రంగారెడ్డి జిల్లా కౌసలాబాద్ లో 76, నల్గొండ జిల్లా చందంపేటలో 65 మిల్లిమీటర్ల వర్షం కురిసింది.


Also Read: Prabhas Fans Vs Mega Fans: బాధలో ఉండగా ఇదేం పంచాయితీ? ప్రభాస్-చిరంజీవిలకి పోలిక ఎందుకు?


Also Read: Adipursh Teaser Poster: విల్లు ఎక్కిపెట్టిన రఘు రాముడు.. పోస్టర్ తోనే పూనకాలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook