Weather updates: హైదరాబాద్‌: తెలంగాణలో శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇప్పటికే గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిత్యం వర్షాలు కురుస్తుండగా.. గడిచిన 24 గంటల్లో పలు చోట్ల భారీ వర్షపాతం ( Heavy rainfall ) నమోదైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌లో పలు చోట్ల కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే నగరం తడిసి ముద్దవుతోంది. లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తుతోంది. మరోవైపు సంగారెడ్డిలోని అన్నాసాగర్‌లో 19 సెంటిమీటర్లు, కామారెడ్డిలోని జుక్కల్‌లో 18 సెంటీమీటర్లు, సంగారెడ్డిలోని జోగిపేటలో 15 సెంటిమీటర్లు, భద్రాద్రిలోని ములకలపల్లెలో 15 సెంటిమీటర్లు, సిద్దిపేటలోని కొండపాకలో 11 సెంటిమీటర్లు, కామారెడ్డిలోని బిక్నూరులో 10, వికారాబాద్‌లోని దోమలో 9సెం.మీ వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కర్ణాటకలో వాతావరణ మార్పులతో పాటు, జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కారణంగానే భారీ వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ( Also read: IAS Sweta mohanty: హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు కరోనా పాజిటివ్ )


ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు..
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు రిజర్వాయర్లలోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. శ్రీశైలం, జూరాల, నాగార్జునసాగర్, కాళేశ్వరం ( Kaleshwaram project ) వంటి భారీ నీటి ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. ప్రాజెక్టుల్లోకి వరద నీరు పోటెత్తుతుండటంతో నీటిపారుదల శాఖ అధికారులు ( Irrigation dept ) పలు ప్రాజెక్టుల నుంచి గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు ( Jurala Project ) నుంచి గురువారం  11 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. 
Also read: Telangana: జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు


 Photo gallery: ఐస్ క్రీమ్ బ్యూటీ Tejaswi Madiwada hot photos