Smita Sabharwal Tweet on Independence day 2024 Goes viral: దేశంలో 78  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయజెండాను ఎగురవేశారు. అదే విధంగా.. మోదీ 11 సార్లు ఎర్రకోట మీద జాతీయజెండాను ఎగురవేసిన ప్రధానిగా రికార్డు క్రియేట్ చేశారు. దేశ వ్యాప్తంగా పల్లె, పట్నం అనితేడాలేకుండా.. ప్రతి చోట్ల జాతీయ జెండాలను ఎగుర వేసి, తమ దేశభక్తిని ప్రజలు చాటుకున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ప్రస్తుతం ఫైనాన్స్ కమిషన్ మెంబర్ గా పనిచేస్తున్నారు. ఇండిపెండెన్స్ డే నేపథ్యంలో స్మితా సబర్వాల్ చేసిన ట్విట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది. స్మితా తన విశ్వకవి రవీంద్రనాత్ ఠాగూర్ కోట్ ను ట్విట్ లో జతచేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఎక్కడైతే మనస్సు భయంలేకుండా.. ప్రశాంతంగా ఉంటుందో.. ప్రతి మనిషి సగర్వంగా తలెత్తుకుని ఉండగలుగుతాడో.. ఎక్కడైటే.. ప్రపంచం ముక్కులుగా కాకుండా.. సంకుచిత భావాలు లేకుండా ఉంటుందో..మతం, కులం, జాతులు వంటి బేధాలు చూపరో.. ఎక్కడైతే.. నీతి, నిజాయితీలు సంపూర్ణంగా ఉంటాయో, ఎక్కడైతే.. లాజిక్ మిస్ అవ్వకుండా.. తాత్వికంగా ఆలోచిస్తారో..మూఢ నమ్మకాలు ఉండవో.. మన ఆలోచనలు, స్వేచ్ఛగా కార్యరూపం దాల్చుతాయో.. మనిషి సంకుచితంగా కాకుండా.. సత్యానికి దగ్గరగా  ఆలోచిస్తాడో.. ఆ ప్రపంచంలోకి  నా భారతావనీని తీసుకెళ్లాలని రవీంద్ర నాథ్ ఠాగూర్ ఒక కవిత్వంను రాశాడు. ఇదే కోట్ ను.. సీనియర్ ఐఏఎస్ అధికారిణి.. ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.


Read more: Samantha Tweet: మరోసారి సంచలనంగా సమంత పోస్టు.. మిడిల్ ఫింగర్ చూయిస్తూ.. ఆ ఇద్దరికి ఇచ్చిపడేసినట్లేనా..?


ఇటీవల స్మితా సబర్వాల్ సివిల్స్ సర్వీసులలో దివ్యాంగులకు రిజర్వేషన్ లు అవసరమా.. అని ట్విట్ చేశారు. అది కాస్త రచ్చగామారి, పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇక తాజాగా, ఈ అంశం హైకోర్టు వరకు చేరింది.  హైకోర్టుదీనిపై స్మితా సబర్వాల్ కు నోటీసులు సైతం జారీచేసిన విషయం తెలిసిందే. కొన్నిరోజుల క్రితం స్మితా సబర్వాల్.. ఎక్స్ లో పోస్టుపెట్టి.. ఎయిర్ ఫోర్స్ లలో, వైద్యరంగంలో దివ్యాంగులను తీసుకుంటారా.. అని ప్రశ్నించారు. అలాంటి సమయంలో సివిల్స్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా.. అంటూ కామెంట్లు చేశారు. ఇది దేశ వ్యాప్తంగా రచ్చగా మారింది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter