Samantha Tweet: మరోసారి సంచలనంగా సమంత పోస్టు.. మిడిల్ ఫింగర్ చూయిస్తూ.. ఆ ఇద్దరికి ఇచ్చిపడేసినట్లేనా..?

Samantha Ruth prabhu: సమంత మరోసారి ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపైన ఫ్యాన్స్ మాత్రం తమదైన స్టైల్ లో కామెంట్ లు చేస్తున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Aug 15, 2024, 01:11 PM IST
  • నెట్టింట హల్ చల్ మారిన సమంత పోస్టు..
  • రచ్చగా మారిన ఘటన..
Samantha Tweet: మరోసారి సంచలనంగా సమంత పోస్టు.. మిడిల్ ఫింగర్ చూయిస్తూ.. ఆ ఇద్దరికి ఇచ్చిపడేసినట్లేనా..?

Samantha Ruth Prabhu reaction after Naga Chaitanya Sobhita Dhulipala: చైతు, శోభిత ధూళి పాళ్ల ఎంగెజ్ మెంట్ ఇటీవల గ్రాండ్ గా జరిగింది. కొద్ది మంది బంధువులు, స్నేహితుల మధ్య వీరి నిశ్చితార్థం కన్నుల పండుగగా జరిగింది. అక్కినేని నాగార్జున తన సోషల్ మీడియాలో అకౌంట్ లో చైతు, శోభితాల నిశ్చితార్థం ఫోటోలను పంచుకున్నారు. ఇద్దరు కూడా ఆనందంగా ఉండాలని కూడా ఆశీర్వదించారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

 

మరోవైపు అక్కినేని ఫ్యాన్స్ సైతం.. చైతు, శోభితలకు స్పెషల్ విషేస్ చెప్పారు. ఇదిలా ఉండగా..చైతు ఎంగేజ్ మెంట్ జరిగినప్పటి నుంచి సమంతా తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఒకవైపు వేణుస్వామి మరల, చైతు, శోభితల వైవాహిక జీవితంలోపై జ్యోతిష్యం చెప్పిరచ్చకు తెరలేపారు. వేణు స్వామి జ్యోతిష్యం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇదిలా ఉండగా.. తాజాగా, సమంతా ఎక్స్ వేదికగా చేసిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్గా మారింది. 

పూర్తి వివరాలు..

సమంత రూత్ ప్రభు ఇటీవల స్టార్ స్టార్ డైరెక్టర్ తో ఎఫైర్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లుకొడుతున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడియోరు తో సామ్ డేటింగ్ చేస్తున్నారంటూ కూడా వార్తలు వైరల్ గా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజగా, సమంతా ఎక్స్ లో చేసిన పోస్టు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.  సామ్.. స్టైలిష్ లుక్ లో ఇన్ స్టాలో సెల్ఫీ పోస్టు చేశారు. స్వెట్ షర్ట్ వేసుకుని, కూల్ గా గాగుల్స్ వేసుకున్నారు.ఆ స్వెట్ షర్ట్ మీద.. ది మ్యూజీయం ఆఫ్ పీస్ అండ్ క్వైట్ అని రాసి ఉంది.

అదే విధంగా ఆమె కూర్చున్న పోశ్చర్ లో నుదురుపై మధ్యవేలు మాత్రమే కన్పించే విధంగా సెల్ఫీ ఫోటో పోస్ట్ చేశారు. దీనిపై ఆమె అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇటీవల సమంతపై అనేక పుకార్లు వస్తున్నాయి. ఒకవైపు చైతు ఎంగెజ్ మెంట్ జరగటంతో సామ్ ఏడుస్తుందని కొంత మంది బాధపడుతున్నారు. మరికొందరు చైతుకు భలే జరిగిదంటూ కూడా కామెంట్ లు చేస్తున్నారు. ఇదిచాలదన్నట్లు.. సామ్ కు..ఇటీవల కాలంలో..బాలీవుడ్ డైరెక్టర్ తో ఎఫైర్ లో ఉన్నారని కూడా రూమర్స్ స్ప్రెడ్ చేశారు. మరికొందరు ఒక అడుగుముందుకు వేసి.. వీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నారని కూడా రాసుకొచ్చారు.

Read more: Husband Harassment: భార్య అందాన్ని చూసి ఓర్వలేని ప్రబుద్ధుడు.. అడవికి తీసుకెళ్లి ఏంచేశాడో తెలుసా..?  

ఈ నేపథ్యంలో వీటన్నింటికి సామ్ ఒక పోస్టుతో చెక్ పెట్టిందని కూడా మరికొందరు రిప్లైలు ఇస్తున్నారు.  సామ్.. ఇలాంటి పుకార్లను పట్టించుకొనని, తన లైఫ్ లో బిజీగా ఉన్నానంటూ కూడా ఇన్ డైరెక్ట్ గా చెప్పిందని కూడా కొంత మంది చర్చించుకుంటున్నారు. అదే విధంగా మధ్య వేలు చూపిస్తు.. కాస్త ఘాటుగానే ఈ రూమర్స్ కు కౌంటర్ ఇచ్చిందని కూడా సామ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. సెల్ఫీ లో ఉన్న టీ షర్ట్ పై రాసున్న కొటేషన్‌.. ఈ ఫొటోకు ఆమె జోడించిన పాట అభిమానులను అలరిస్తోంది. 'శాంతి, నిశ్శబ్దాల మ్యూజియం' అని రాసుండగా దీనికి 'Now We Are Free' అనే ఆంగ్ల పాటను ఆమె జోడించారు. ప్రస్తుతం సమంతా చేసిన ట్విట్ మాత్రం చర్చనీయంశంగా మారింది.

Trending News