CM KCR: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రో సెంటర్ అందుబాటులోకి రానుంది. ఆగస్టు 4న సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేయబోతున్నారు. బంజారాహిల్స్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ రూపుదిద్దుకుంది. ప్రాజెక్ట్‌తో అనుబంధం ఉన్న అన్ని శాఖలకు సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఓ మెమోను విడుదల చేశారు. ప్రారంభోత్సవానికి ముందే పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయాలన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"239467","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


గతంలో ఎన్నడూ లేనివిధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణమవుతోంది. లాజిస్టిక్స్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్‌కు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సీవీ ఆనంద్ కోరారు. కమాండ్  కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం వైభవంగా సాగబోతోందని..సీఎం కేసీఆర్ రాబోతున్నారని మెమోలో ఆయన తెలిపారు. నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్‌లను దీనికి అనుసంధానం చేశామన్నారు. 


[[{"fid":"239468","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


పోలీస్ శాఖలో ఉన్న వివిధ రకాల యూనిట్లన్నీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో నుంచే పనిచేస్తాయి. దీనికి పోలీస్ టవర్స్‌గా నామాకరణం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 9.25 లక్షల కెమెరాలను కంట్రోల్ సెంటర్‌ నుంచే మానిటర్ చేయనున్నారని సీపీ ఆనంద్ వెల్లడించారు. 


[[{"fid":"239469","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


Also read:Goa Zuari River  Accident: గోవాలో నదిలోకి దూసుకెళ్లిన కారు..నలుగురు జల సమాధి..!


Also read:IND vs WI: రేపటి నుంచి భారత్, విండీస్ మధ్య టీ20 ఫైట్..టీమిండియా జట్టు ఇదే..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook