హైదరాబాద్: మున్సిపాలిటీలలోని ఆస్తిపన్ను (Property Tax In Municipalities) బకాయిదారులకు తెలంగాణ పురపాలకశాఖ శుభవార్త అందించింది. ఇప్పటివరకూ ఉన్న ఆస్తిపన్ను బకాయిలను మొత్తంగా ఒకేసారి చెల్లించిన పక్షంలో దానిపై వడ్డీ 90శాతం తగ్గిస్తున్నట్లు తెలిపింది. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ఇది వర్తిస్తుంది. అయితే ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 15 తేదీల మధ్య మొత్తం ఆస్తిపన్ను చెల్లించినవారికి ఈ ఆఫర్ వర్తింపజేస్తామని ఉత్తర్వులలో పేర్కొన్నారు. భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి రికార్డులు


ఆస్తి పన్నుపై చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోయిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోని వారికి అధికారులు నోటీసులు జారీ చేశారు. వాస్తవానికి బకాయి అసలు విలువ రూ.1,477.86 కోట్లు ఉండగా.. వడ్డీ సైతం రూ.1,017 కోట్లుగా ఉంది. మొత్తం విలువ దాదాపు రెండున్నర వేల కోట్లు. అయితే పన్ను తగ్గిస్తే తాము చెల్లించడానికి సిద్ధమని పలువురు బకాయిదారుల కోరిక మేరకు పురపాలకశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా జీహెచ్ఎంసీ పరిధిలోనే మొండి బకాయిలు రూ.1000 కోట్ల మేర వసూలు కానున్నాయి. పోకిరి లేడీ విలన్ Sheeva Rana Hot Photos వైరల్   
నితిన్, షాలిని పెళ్లి వేడుక ఫొటోలు