TG New DGP Will be IPS Jitender: సీఎం రేవంత్ రెడ్డి పోలీసుశాఖలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే తెలంగాణ డీజీపీని మార్చుతున్నారని తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్ కు చెందిన జితేందర్ రెడ్డిని, తెలంగాణ పోలీసు బాస్ గా నియమిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్నిరకాల అధికారిక ఫార్మాలిటీస్ పూర్తి అయిపోయినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి నిన్న.. మహబూబాబాద్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో..అధికారిక ఉత్తర్వులు వెలువడటానికి కాస్త ఆలస్యమైందంట. ఈ రోజు లేదా రేపు  కొత్త పోలీసు బాస్ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని జోరుగా వార్తలు వస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: CM Revanth Reddy: రెచ్చిపోయిన సీఎం రేవంత్.. కోచింగ్ సెంటర్లపై సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్..


ఈ ఉత్తర్వులు వెలువడితే.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సర్కారు నియమించిన తొలి డీజీపీగా గా జితేందర్ కానున్నారు. ప్రస్తుతం డీజీపీ హోదాలో ఉన్న ఆయన.. హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్నారు.అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


ఇదిలా ఉండగా.. పంజాబ్ లోని జలంధర్ లో రైతు కుటుంబంతో జితేందర్ జన్మించారు. ఆయన తొలుత నిర్మల్ ఏఎస్పీగాను, ఆ తర్వాత బెల్లంపల్లి ఎస్పీగాను విధులు నిర్వర్తించారు. ఢిల్లీ సీబీఐలో.. 2004,06 వరకు గ్రేహౌండ్స్ లోకూడా పనిచేశారు. ఆతర్వాత డీఐజీగా ప్రమోషన్ తో.. విశాఖ కు వెళ్లారు. అప్పాలో పనిచేసి, వరంగల్ రేంజ్ డీఐజీగాను పనిచేశారు. ఈ క్రమంలో ఆయన 2025 లో సెప్టెంబరులో పదవీవిరమణ చేయనున్నారు. ఇప్పుడు డీజీపీగా నియమితులైతే..14నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది.  తెలంగాణలో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ పాలనలో తనదైన మార్కుు చూపిస్తున్నారు.


ఒక వైపు గత బీఆర్ఎస్ చేసిన అక్రమాలను బైటపెడుతూనే,మరోవైపు తెలంగాణ ప్రజలకు మేలు చేసేదిశగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అమలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కొన్నిరోజులుగా నిరుద్యోగుల నిరసనలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో.. కొందరు రాజకీయా నాయకులు, పార్టీలు, విద్యార్థులను ఉసిగొల్పుతున్నారని అన్నారు. 


Read more: Rat in Chutney: చట్నీలో చిట్టెలుక ఎంత బాగా ఈత కొడుతుందో చూశారా..?.. వీడియో ఇదిగో..


కోచింగ్ సెంటర్ ల వారు మాఫీయాగా ఏర్పడి కిరాయి వారితో ధర్నాలు, నిరసలు చేయిస్తున్నారంటూ కూడా రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు నిరుద్యోగులు మాత్రం.. డీఎస్సీ ఎగ్జామ్, గ్రూప్స్ వాయిదా వేసి, పోస్టులు పెంచి రీషెడ్యూల్ చేయాలని కూడా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి