Basara IIT: బాసర ట్రిపుల్ ఐటీకి మంత్రి కేటీఆర్.. విద్యార్థులకు రిలీఫ్ దక్కేనా?
Basara IIT: విద్యార్థుల నిరసనలు, ఆందోళనలతో అట్టుడికిన బాసర ట్రిపుల్ ఐటిలో సమస్యల పరిష్కారంపై తెలంగాణ సర్కార్ ఫోకస్ చేసింది. ఐటీ మంత్రి కేటీఆర్ క్యాంపస్ కు వెళుతున్నారు.
Basara IIT: విద్యార్థుల నిరసనలు, ఆందోళనలతో అట్టుడికిన బాసర ట్రిపుల్ ఐటిలో సమస్యల పరిష్కారంపై తెలంగాణ సర్కార్ ఫోకస్ చేసింది. ఐటీ మంత్రి కేటీఆర్ క్యాంపస్ కు వెళుతున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఆయన ట్రిపుల్ ఐటీని సందర్శించనున్నారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోనున్నారు. కేటీఆర్ పర్యటనతో తమ సమస్యలకు పరిష్కారం లభించనుందనే ఆశతో విద్యార్థులు ఉన్నారు.
గత నెలలో బాసర ట్రిపుల్ ఐటీ ఆందోళనలతో దద్దరిల్లింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థుల రోజుల తరగడి నిరసన తెలిపారు. క్యాంపస్ కు సీఏం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ రావాలని డిమాండ్ చేశారు. అయితే విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్యాంపస్ కు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. అయితే మంత్రి హామీ ఇచ్చినా సమస్యలు అలానే ఉన్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మంత్రి పర్యటన తర్వాతే ఫుజ్ పాయిజన్ జరిగింది. పదుల సంఖ్యలో విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. తర్వాత క్యాంపస్ లోని ఓ గదిలో గంజాయితో ఇద్దరు విద్యార్థులు పట్టుబడ్డారు. ఈ ఘటనలు ట్రిపుల్ ఐటీలో ఆందోళనకు కారణమయ్యాయి.
ట్రిపుల్ ఐటీలో వరుసగా సమస్యలు వస్తుండటంతో నేరుగా మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారని తెలుస్తోంది. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు మంత్రి కేటీఆర్. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించి అక్కడి విద్యార్థులతో సమావేశం కానున్నారు. విద్యార్థులతో కలిసి మంత్రి కేటీఆర్ లంచ్ చేస్తారు. దాదాపు రెండు గంటల పాటు ముగ్గరు మంత్రులు క్యాంపస్ లోనే ఉండనున్నారు. మంత్రి కేటీర్ రాకతో తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నమ్మకంతో ఉన్నారు.
Also read: Bank Holidays: అక్టోబర్‌లో 21 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.. పుల్ లిస్ట్ ఇదే..!
Also read: AP RAIN ALERT: ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ వార్నింగ్ తో సర్కార్ అలెర్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook