AP RAIN ALERT: తెలుగు రాష్ట్రాల్లో ఈ సీజన్ లో మంచి వర్షాలు కురిశాయి. ఏపీ, తెలంగాణలోని దాదాపుగా అని సాగునీటి ప్రాజెక్టులు నిండిపోయాయి. మరో ఐదు రోజుల్లో వర్షకాల సీజన్ ముగియనుంది. అయినా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్రకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. కొన్ని రోజులుగా ఏపీలో వాతావరణం సమ్మర్ ను తలపిస్తోంది. ఎండలు మండిపోతున్నాయి. వీటి ప్రభావంతో క్యుములోనింబస్ మేఘాలు ఆవరించాయి. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.
ఇటీవల కోస్తా, రాయల సీమల్లో ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. వచ్చే మూడు రోజుల పాటూ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు పడనున్నాయి. రాష్ట్రంలో సాధారణం కంటే పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి.ఆదివారం సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు టెంపరేటర్ ఎక్కువగా నమోదైంది. ఒంగోలు, నెల్లూరులో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పుడు వర్షాలు కురిస్తే వాతావరణం కూలై ప్రజలకు ఎండల నుంచి ప్రజలను కాస్త ఉపశమనం దక్కే అవకాశం ఉంది.
ఎన్టీఆర్ కృష్ణా, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, ఏలూరు, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, పల్నాడు, కర్నూలు, విజయనగరం, నంద్యాల, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. నెల్లూరు, కడప, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Also read:Viral Video: పాఠశాలలో విద్యార్థుల పాడు పని..ఫైర్ అవుతున్న నెటిజన్లు..!
Also read:IND vs AUS: ఉప్పల్ స్టేడియంలో టీమిండియా ఎన్ని విజయాలు సాధించిందో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
AP RAIN ALERT: ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ వార్నింగ్ తో సర్కార్ అలెర్ట్