Jagga Reddy: తెలంగాణలో ఇటీవల జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై సొంత కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాడని సంచలన ప్రకటన చేశారు. బాబును ముందు ఉంచి బీజేపీ రాజకీయం నడిపిస్తోందని పేర్కొన్నారు. బీజేపీ దర్శకత్వంలో బాబుతోపాటు పవన్‌ కల్యాణ్‌ పని చేస్తున్నారని చెప్పారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Revanth Reddy: యువత కోసం రేవంత్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం


 


హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'చంద్రబాబు గతంలో హైదరాబాద్ వచ్చి పోయేది ఎవరికీ తెలియదు. కానీ తెలంగాణలో టీడీపీని ముందు పెట్టి బీజేపీ రాజకీయం మొదలుపెట్టింది. విభజన పేరుతో చంద్రబాబు ప్రవేశించాడు. బీజేపీ దర్శకత్వంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పని చేస్తున్నారు. ఏపీలో వేసిన పొలిటికల్ గేమ్ తెలంగాణలో మొదలుపెట్టాలని చూస్తున్నారు' అని ఆరోపించారు.

Also Read: Monsoon: వినండోయ్‌.. రానున్న మూడు రోజులు వర్షాలే.. వర్షాలే


 


ఐటీకి పునాదులు వేసింది కాంగ్రెస్.. కొనసాగించింది చంద్రబాబు, కేసీఆర్‌ అని జగ్గారెడ్డి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ని దెబ్బతీయడానికి బీజేపీ ఎత్తుగడలో చంద్రబాబు పావుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. బీజేపీ ఎన్ని వ్యూహాలు చేసినా కాంగ్రెస్ కార్యకర్తల శక్తిని చంపలేరని స్పష్టం చేశారు. ఈడీ, సీబీఐ ఐటీ వల్లనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. లేదంటే రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేవారని పేర్కొన్నారు.


కాంగ్రెస్ నాయకత్వం.. కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం వచ్చిందని జగ్గారెడ్డి హెచ్చరించారు. ఏపీలో బీజేపీ పరోక్షంగా జగన్‌ని కొనసాగించగా.. ఇప్పుడు పవన్ కల్యాణ్‌తో చంద్రబాబుని కంట్రోల్‌లో పెట్టుకుందని తెలిపారు. 'బీజేపీ, కాంగ్రెస్‌లకు తోడు బీఆర్‌ఎస్‌ పార్టీ బలంగానే ఉంటది. కూతురు జైల్లో ఉన్నా బీజేపీతో కొట్లాడాలని కేసీఆర్‌ చూస్తున్నాడు' అని జగ్గారెడ్డి తెలిపారు. రెండు రాష్ట్రాలు రెండు కండ్లు అన్నాడని.. ఇప్పుడు హైదరాబాద్‌ నాది అంటున్నాడని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter