Monsoon: వినండోయ్‌.. రానున్న మూడు రోజులు వర్షాలే.. వర్షాలే

Moderate To Heavy Rains In Telangana Coming Three Days: నైరుతి రుతుపవనాలు నిరాశ పరుస్తున్నారు. రెండు వారాలైనా ఇంకా ఆశించిన మేర వర్షాలు పడని సందర్భంలో వాతావరణ శాఖ శుభవార్త వినిపించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 7, 2024, 03:49 PM IST
Monsoon: వినండోయ్‌.. రానున్న మూడు రోజులు వర్షాలే.. వర్షాలే

Telangana Weather Report: వర్షాకాలం ప్రారంభమైనా ఆశించిన వర్షాలు కురవడం లేదు. దీంతో పంటలు వేసుకోవాలనుకునే రైతులు వరుణదేవుడు కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి రైతులకు వాతావరణ శాఖ శుభవార్త వినిపించింది. రానున్న రోజుల్లో వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించింది. మోస్తరుతోపాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రానున్న మూడు రోజుల విషయమై వాతావరణ వివరాలు వెల్లడించింది.

Also Read: RTC Bus Deliver: డాక్టర్‌లా మారిన కండక్టర్.. ఆర్టీసీ బస్సులో మహాలక్ష్మి పుట్టింది

 

రాష్ట్రంలో రాగల మూడు రోజుల  వరకు  వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది.  ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి. మీ. ఎత్తులో కొనసాగుతున్న కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. కొన్ని చోట్ల రేపు, ఎల్లుండి (సోమ, మంగళవారం) చాలా చోట్ల వర్షాలు పడతాయని వివరించింది.

Also Read: Telangana Thalli Statue: తెలంగాణలో బుల్డోజర్‌ పాలన? తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా స్థానం లేదా?

 

ఇదే ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ వర్షాలతో పంటలకు ఆశించిన ప్రయోజనం చేకూరే అవకాశం లేదని రైతులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు ఇంకా విస్తరించకపోవడంతో రాష్ట్రంలో వర్షాపాతం కొరత ఏర్పడింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News