Jagtial Girl Kidnap: జగిత్యాలలో కిడ్నాప్ కలకలం.. 12 ఏళ్ల బాలికను కారులో ఎక్కించుకుని..! ఊహించని ట్విస్ట్
12 years Old Girl escaped from Four Thugs in Jagtial. జగిత్యాల జిల్లాలో 12 ఏళ్ల బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. కొందరు దుండగులు బాలికను కారులో ఎక్కించుకుని పరారయ్యారు.
12 years Old Girl Kidnapped in Jagtial: ఇటీవలి రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో చిన్నారుల, మహిళల కిడ్నాప్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. వరుస కిడ్నాప్ కేసులతో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. డాక్టర్ వైశాలి, దమ్మాయిగూడ చిన్నారి, కరీంనగర్ అమ్మాయి కేసులు పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా అలాంటి మరో కేసు నమోదైంది. జగిత్యాల జిల్లాలో 12 ఏళ్ల బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. కొందరు దుండగులు బాలికను కారులో ఎక్కించుకుని పరారయ్యారు. వివరాల్లోకి వెళితే..
జగిత్యాల రూరల్ మండలం దరూర్ పట్టణంలో కోటి కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. శ్రీకాకుళంకు చెందిన వీరు గత 10 సంవత్సరాల పాటు ఇక్కడే ఉంటున్నారు. సాయి జనతా గ్యారేజ్‌లో కోటి పనిచేస్తున్నాడు. కోటి దంపతులకు సాయి లహరి అనే 12 సంవత్సరాల బాలిక ఉంది. ఆమె 7వ తరగతి చదువుకుంటుంది. పని నిమిత్తం బయటకు వచ్చిన లహరిని కొందరు దుండగులు చూశారు. బాలిక పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడంతో.. నలుగురు దుండగులు బాలికను కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
బయటికి వెళ్లిన బాలిక ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కోటి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇరుగు పొరుగు వారిని అడిగినా లాభం లేకపోయింది. దాంతో బాలిక కోసం తల్లిదండ్రులు వెతకసాగారు. బాలికను కారులో బంధించి నలుగురు దుండగులు ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఇది గమనించిన లహరి.. చాకచక్యంగా కారులో నుంచి కిందికి దూకేసింది. అక్కడనుంచి పారిపోయి దుండగుల బారి నుంచి తప్పించుకుంది. స్థానికులను చూసిన బాలిక విషయం వారికి చెప్పి.. తండ్రి కోతికి ఫోన్ చేసింది.
విషయం తెలుసుకున్న బాలిక తండ్రి కోటి ఆమె ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. బాలికకు ఏమీ జరగకపోవడంతో కోటి కుటుంబ సభ్యులు ఊపిరి పెల్చుకున్నారు. ఆపై జగిత్యాల రూరల్ పోలీసులకు బాలిక కుటుంబ సభ్యులు పిర్యాదు చేశారు. కేసు నమోచు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలికను ఎందుకు ఎత్తుకెళ్లారు అన్నదాపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. బాలిక నుంచి సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read: Lucky Days for Zodiac Signs: ఈ రోజున కొత్త పనులను ప్రారంభిస్తే.. 100 శాతం విజయం సాధిస్తారు!
Also Read: ఆ సుగుణాలు ఉన్న మహిళ అయితే ఓకే.. జీవిత భాగస్వామిపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.