Lucky Days for All Zodiac Signs: జ్యోతిషశాస్త్రంలో 12 రాశిచక్ర గుర్తుల గురించి వివరించబడ్డాయి. ఈ రాశులందరికీ వారంలో ఒకటి లేదా రెండు రోజులు శుభప్రదంగా ఉంటాయి. పండితుల ప్రకారం.. రాశిచక్ర గుర్తులకు చెందిన వ్యక్తులు వారి పవిత్రమైన రోజున ఏదైనా పని ఆరంభిస్తే, 100 శాతం విజయం సాధిస్తారు. ఈ నేపథ్యంలో రాశిచక్ర గుర్తుల ప్రకారం వారి శుభ దినాల గురించి తెలుసుకుందాం. దీనితో పాటు ఆ రోజు ఏ పని చేయడం ద్వారా మరింత విజయాన్ని పొందవచ్చో కూడా చూద్దాం.
సింహం:
వారంలోని మొదటి రోజు (ఆదివారం) అన్ని రాశుల వారికి శుభప్రదంగా (అదృష్ట రోజు) పరిగణించబడుతుంది. అయితే సింహ రాశి వారికి ప్రత్యేకంగా ఉంటుంది. సింహ రాశి వారు ఆదివారం పనులను ప్రారంభిస్తే.. మీ విజయావకాశాలు పెరుగుతాయి. ఈ రోజున మీరు సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపితే.. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
కర్కాటకం:
కర్కాటక రాశి వారికి సోమవారం అదృష్టమని భావిస్తారు. ఈ రోజున వారు ఏ పని ప్రారంభించినా విజయం సాధించే అవకాశాలు బలంగా ఉంటాయి. సోమవారం కొత్త స్టార్టప్‌ను ప్రారంభిస్తే.. విజయావకాశాలు 100 శాతంగా ఉంటాయి. డబ్బుకు సంబంధించిన విషయాలలో శుభవార్తలు వింటారు.
వృశ్చికం, మేషం:
వృశ్చికం మరియు మేష రాశుల వారికి మంగళవారం చాలా అదృష్టమని జ్యోతిషశాస్త్రంలో చెప్పబడింది. ఈ రోజున కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నా లేదా ఉద్యోగంలో కొత్త బాధ్యత తీసుకున్నా.. మీరు మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ రోజున మీ కష్టమైన పనులు కూడా విజయవంతంగా పూర్తవుతాయి.
మిథునం, కన్యా, కుంభం:
బుధవారాన్ని వినాయకుడిని పూజించే రోజు అంటారు. ఈ రోజు మిథునం, కన్య మరియు కుంభరాశి వారికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఈ మూడు రాశుల వారు పర్యటన, కార్యాలయ పర్యటన, మార్కెటింగ్-అమ్మకాలపై ప్రణాళికతో పనిని ప్రారంభిస్తే.. మీ విజయావకాశాలు అనేక రెట్లు పెరుగుతాయి.
ధనుస్సు, మీనం:
ధనుస్సు మరియు మీన రాశి వారికి విష్ణువు మరియు బృహస్పతికి ఇష్టమైన గురువారం అదృష్ట రోజు. ఈ రోజున ఈ రెండు రాశుల వారు ఏ పెట్టుబడి పెట్టినా.. మంచి రాబడిని పొందే అవకాశాలు ఉన్నాయి. దానధర్మాలు చేయడం వల్ల జీవితంలో సంతోషం, ఐశ్వర్యం, సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది.
వృషభం, తులా:
శుక్రవారం లక్ష్మీదేవిని పూజించే రోజుగా చెబుతారు. ఈ రోజున మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. అంతేకాదు ఎవరికీ కోపం రాకుండా పని చేయాలి. లక్ష్మీ దేవి ఆశీస్సులతో మీరుశుక్రవారం కొత్త వ్యాపారం ఆరంభించొచ్చు. మీరు వ్యాపార సమావేశాలు, ప్రజలను కలవడం మరియు సాహస యాత్రలకు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రాశుల వారికి కల్యాణం జరుగుతుంది.
మకరం:
శనివారం రోజున శనిని ఆరాధిస్తారు. ఈ రోజు మకర రాశి వారికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున మీరు ఏ పని ప్రారంభించినా శనిదేవుని అనుగ్రహం వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది. శనివారం నూనె మరియు ఇనుమును దానం చేయడం ద్వారా.. శని దేవుడి ఆశీర్వాదాలు మీపై ఉంటాయి.
Also Read: మళ్లీ పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే!
Also Read: ఆ సుగుణాలు ఉన్న మహిళ అయితే ఓకే.. జీవిత భాగస్వామిపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.